supreme court appoints special sit for tirumala laddu probe

తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం కీలక తీర్పు

supreme-court-appoints-special-sit-for-tirumala-laddu-probe

న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సుబ్రమణ్య స్వామి కోర్టుకు స్వయంగా తన వాదనలు వినిపించారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. ఇక వైవీ సుబ్బారెడ్డి తరఫున కిపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం ఉందన్నారు. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని తెలిపారు. అయితే, అందులో కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే సీఎం లడ్డూ కల్తీపై ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. వివాదం కోర్టులో ఉండగానే నిన్న కూడా ఒకరు ఇదే వివాదంపై మాట్లాడారని కొర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Advertisements

అనంతరం ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. ఈ విషయంలో తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తోనే దర్యాప్తు చేయించాలనుకుంటున్నామని కోర్టుకు విన్నవించారు.

Related Posts
చంద్రబాబు దావోస్ పర్యటన పై వైసీపీ సెటైర్లు
cbn davos

చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. 'చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. 'అధికారంలో ఉన్న Read more

విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని
విజయమ్మకు మొత్తం తెలుసు ఇద్దరికీ న్యాయం చేస్తారు: బాలినేని

అమరావతి: వైస్‌ జగన్‌ మరియు వైఎస్‌ షర్మిల ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ స్పందించాలని మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం Read more

తెలంగాణలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి
4.50 lakh Indiramma houses in Telangana.. Minister Ponguleti

హైదరాబాద్‌: తెలంగాణ మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ Read more

Drons: అగ్రదేశాల సరసకు భారత్‌..డ్రోన్లు, క్షిపణులను కూల్చే ఆయుధం
అగ్రదేశాల సరసకు భారత్‌..డ్రోన్లు, క్షిపణులను కూల్చే ఆయుధం

లేజర్ టెక్నాలజీతో అనుమానిత డ్రోన్లు, శత్రు క్షిపణులను ధ్వంసం చేసే వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు భారత్ ప్రకటించింది. కర్నూలు సమీపంలో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో ఈ Read more

×