శ్రీకాళహస్తి : బంగారు కుటుంబాలుగా తీర్చి దిద్దుటకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి పారిశ్రామిక వెత్త సహకరించాలని శాసనసభ్యుడు బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి పిలుపు నిచ్చారు. శ్రీకాళహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి అధ్యక్షతన పంచాయతీరాజ్ అతిధి గృహంలో పారిశ్రామిక వెత్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి 31 కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా శాసనసభ్యుడు సుధీర్రెడ్డి (Sudheer Reddy) మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ‘బంగారు కుటుంబాల’ కార్యక్రమాలను పి4గా తీసుకు న్నారన్నారు.
సమాజం లోనూ, ఆంధ్రరాష్ట్రం లో పేదరికం లేని సమాజాన్ని తీర్చి దిద్దాలనే మహోన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలను ఆహ్వాని స్తున్నామని అలాగే పరిశ్రమల స్థాపనకు అన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నామని అయితే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సిఎం లక్ష్య సాధనకు మనం అందరం సహాకరిం చాలని పిలపు నిచ్చారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి పెద్ద పారిశ్రామిక హబ్ ఉందని కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా ఉండాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సమాజంలోని రుగ్మతలను తొలగించుటకు పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదగాలనే మహోన్నత లక్ష్యంతో సిఎం నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో పరిశ్రమలు తమకు అందుబాటులో ఉంటే సిఆర్ఎస్ నిధులను కేటాయించాలని వివరించారు.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Housing Scheme : మూడు జిల్లాల్లో పేద, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు