గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి నిరాశపరుస్తోంది ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి, కేవలం ఒక్క విజయమే అందుకుంది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈరోజు ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో కీలక పోరుకు సిద్ధమైంది.టాస్ గెలిచిన పంజాబ్, బ్యాటింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ ఛేజింగ్ చేయాల్సి వచ్చింది.ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందేనన్న ఒత్తిడిలో సన్‌రైజర్స్ ఉంది.టీమ్ కాంబినేషన్‌లో హైదరాబాద్ ఒక మార్పు చేసింది.కమిందు మెండిస్ స్థానంలో శ్రీలంక ఆటగాడు ఇషాన్ మలింగను తుది జట్టులోకి తీసుకుంది. పంజాబ్ మాత్రం తన జట్టును యధాతథంగా ఉంచింది.ఈ విషయాన్ని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.ఇంకొకవైపు లక్నోలోని వాజ్‌పేయి స్టేడియంలో అభిమానులు ఊపిరి బిగబట్టే మ్యాచ్ చూసారు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, చివరి వరకు పోరాడింది. 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలుపొందింది.ఆఖరి ఓవర్‌లో ఆయుష్ బదోనీ విజయాన్ని ఖరారు చేశాడు. వరుసగా ఫోర్, సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. లక్నో జట్టులో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడు 34 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 1 ఫోర్, 7 సిక్సులు ఉన్నాయి.మార్క్రమ్ 58, పంత్ 21, బదోనీ 28 (నాటౌట్) పరుగులతో సహకరించారు. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పట్టికలో పైకి వెళ్లింది.
Read Also : Shubman Gill : 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసిన గుజరాత్