ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ టాలీవుడ్‌లో స్థిరపడాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటీనటులకు ఇచ్చే గౌరవం తనను ఎంతో ఆకర్షించిందని జాట్ చిత్ర ప్రమోషన్ ఈవెంట్ లో సన్నీడియోల్ మాట్లాడుతూ,టాలీవుడ్ నిర్మాతల నుంచి బాలీవుడ్ నిర్మాతలు ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సూచించారు.
జాట్ చిత్రం
సన్నీ డియోల్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘జాట్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న సన్నీ డియోల్, టాలీవుడ్ సినిమా తీరుతెన్నులు, నిర్మాణ విధానంపై ప్రశంసలు కురిపించారు.టాలీవుడ్ నిర్మాతల నుంచి బాలీవుడ్ నిర్మాతలు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అన్నారు.దక్షిణాదిలో నటీనటులకు గౌరవం ఎక్కువ, వారి అభిప్రాయాలను స్పష్టంగా వినిపించే తత్వం ఉంది, ఇది బాలీవుడ్‌లో కనిపించడం లేదని చెప్పారు.సినిమా నిర్మాణంలో స్పష్టత, కథాపరమైన నిబద్ధత, టాలీవుడ్ చిత్రాలను ప్రత్యేకంగా నిలిపే అంశాలని అభిప్రాయపడ్డారు.
యాక్షన్ డ్రామా
సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జాట్’ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోంది.సయామీ ఖేర్, రెజీనా కథానాయికలుగా నటిస్తుండగా,రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రం ఏప్రిల్ 10న భారీ స్థాయిలో విడుదల కానుంది.

సన్నీడియోల్ వ్యాఖ్యలు
ఒకప్పుడు బాలీవుడ్‌లో దర్శకులు చెప్పినట్లు నిర్మాతలు అనుసరించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అన్నారు.ఇప్పుడు కమర్షియల్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కంటెంట్ కంటే మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీయడం వల్ల ప్రేక్షకులు ఆశక్తి కోల్పోతున్నారు అని వ్యాఖ్యానించారు.దక్షిణాది సినిమాల్లో కథకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, నటీనటులను ఎలా గౌరవిస్తారో నేను ప్రత్యక్షంగా అనుభవించాను అని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని టాలీవుడ్, దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉందని వెల్లడించారు.
తెలుగు సినిమా
సన్నీ డియోల్ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చెప్పడమే కాకుండా, దక్షిణాది సినిమా స్థాయిని, గొప్పతనాన్ని మరింత వెలుగులోకి తెచ్చాయి. ‘జాట్’ సినిమాతో టాలీవుడ్‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలనే ఆశక్తి ఉందని చెప్పారు.