మార్చి 19న భూమి మీదకు బయల్దేరనున్న సునీత విలియమ్స్!

మార్చి 19న భూమి మీదకు బయల్దేరనున్న సునీతా విలియమ్స్!

మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. దాంతో వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపైనా ఈ వ్యోమగాములు స్పందించారు.

Advertisements
మార్చి 19న భూమి మీదకు బయల్దేరనున్న సునీత విలియమ్స్!

స్పేస్ ఎక్స్ మరింత సమయం
ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు. ఇక సునీత విలియమ్స్, విల్మోర్ కొన్నిరోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడారు. తమకోసం మార్చి 12న స్పేస్ఎక కు చెందిన క్రూ-10 అంతరిక్షనౌక రానుందని, నౌకలో కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని తెలిపారు.

సుదీర్ఘంగా అంతరిక్షంలో ఉండిపోవడం ఆందోళనే
“మేము భూమిమీదకు తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి చాలా కష్టమైన అంశం” అని అంతరిక్ష కేంద్రం నుంచి సునీత మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా తాము అంతరిక్షంలో ఉండిపోవడం వల్ల వ్యక్తమవుతోన్న ఆందోళనలను తోసిపుచ్చినప్పటికీ.. భూమిపై ఉన్న ప్రజలపై ఈ ప్రభావం ఉంటుందని విలియమ్స్, విల్మోర్ అంగీకరించారు. 2030లో అంతరిక్ష కేంద్రం (ISS) జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. అప్పటికంటేముందే ఐఎస్ఎస్ను రిటైర్ చేయాలని ఇటీవల మస్క్ ప్రతిపాదించారు. “ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం. నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను” అని విలియమ్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఐఎస్ఎస్లో చిక్కుపోయిన వారిని బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలపై విల్మోర్ స్పందించారు. “అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు. అవి జీవితంలో ఒక భాగం. ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని నా అభిప్రాయం. అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్ పట్ల గౌరవం ఉంది. మేం మా దేశానికి, మా నాయకులకు మద్దతు ఇస్తాం. వారికి మా కృతజ్ఞతలు” అని మాట్లాడారు.

వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి వుండగా..
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టారైనర్’లో వారు ఐఎస్ఎస్ (ISS)కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్ , బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టారైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ఎక్స్లో కలిసి పనిచేస్తోంది.

Related Posts
పుతీన్‌తో రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం
Rajnath Singh high level meeting with Russian President Putin

మాస్కో: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో Read more

కేజ్రీవాల్ మరో కీలక హామీ ప్రకటన
arvind kejriwal

చలికాలంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. బీజేపీ, అప్ ప్రధాన పార్టీలు హామీల గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య Read more

కేజీవాల్ ఓటమికి 2 కారణాలు – పీసీసీ చీఫ్
mahesh delhi

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజీవాల్ పరాజయానికి రెండు ప్రధాన కారణాలను Read more

భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం
భారత్-ఖతార్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం

భారత్, ఖతార్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాపనపై మంగళవారం అధికారికంగా ఒప్పందం మార్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ Read more

×