10 Labourers Killed In Truc

ట్రాక్టర్లు ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు … 13 మంది రోజువారీ కూలీలు భదోహ జిల్లాలో పని ముగించుకొని తిరిగి వారణిసి వైపు వెళుతుండగా, నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కచ్వా సరిహద్దు జిట్‌ రోడ్‌ లో ప్రమాదం జరిగింది.

ఓ ట్రక్కు అదుపుతప్పి ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.మరో ముగ్గురు కూలీలు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన కూలీలను వెంటనే బనారస్‌ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts
OG మూవీలో అకీరా నందన్..?
akira og

పవన్ కళ్యాణ్ - సుజిత్ కలయికలో 'OG' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలియంది కాదు..కేవలం ఫస్ట్ లుక్ Read more

10th Exams : పరీక్షలే జీవితం కాదు.. ఆల్ ది బెస్ట్ – హోంమంత్రి అనిత
SSC Public Exams 2025: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుండి.. విద్యార్థులకు ఇవే ముఖ్య సూచనలు

ఏపీ హోంమంత్రి అనిత పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షలు జీవితంలో కీలకమైనవే కానీ, అవే జీవితం కాదని ఆమె అన్నారు. విద్యార్థులు టెన్షన్ Read more

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రిలీవ్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana government relieved two IPS officers

డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను రిలీవ్ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ Read more

ట్రంప్ మరో నిర్ణయం
Donald Trump front Tower New York City August 2008

త్వరలో అమెరిగా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు Read more