Sunita Williams:సునీత విలియమ్స్ కు ట్రంప్ ఆహ్వానం ఎప్పుడంటే? అంతరిక్షయానం ముగించుకుని భూమికి చేరిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్‌లను వైట్ హౌస్‌కు ఎప్పుడు ఆహ్వానిస్తారనే ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.ఇటీవలే స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ద్వారా ఈ ఇద్దరు వ్యోమగాములు భూమికి సురక్షితంగా చేరుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘట్టాన్ని ప్రశంసించారు.వ్యోమగాముల రాకను పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడిని మీడియా ప్రశ్నించింది. ట్రంప్ స్పందిస్తూ, అంతరిక్ష ప్రయాణం శరీరంపై చాలా ప్రభావం చూపుతుందని గురుత్వాకర్షణ లేకపోవడంతో వారి శారీరక స్థితిలో మార్పులు వస్తాయని వివరించారు.

అంతరిక్షంలో గడిపిన రోజుల ప్రభావం నుంచి బయటపడటానికి వారికి కొంత సమయం అవసరమని అన్నారు.”భూమికి తిరిగి వచ్చిన వెంటనే వారి శరీరం భూమి వాతావరణానికి అలవాటుపడటం అంత తేలిక కాదు.అందుకే ప్రస్తుతం వారిని వైట్ హౌస్‌కు ఆహ్వానించడం లేదు,” అని ట్రంప్ స్పష్టం చేశారు. వ్యోమగాములు పూర్తిగా కోలుకున్నాకే వారిని ఓవల్ ఆఫీసుకు ఆహ్వానిస్తానని ఆయన తెలియజేశారు.సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లాంటి ప్రతిభావంతులైన వ్యోమగాములు విశ్వ పరిశోధనల్లో అగ్రగాములుగా నిలిచారు. వారి ప్రయాణం, కృషి, ధైర్యం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.వారి రాకను సెలబ్రేట్ చేసేందుకు ఇంకా సమయం ఉందని, అయితే అమెరికా తరపున వారికి అండగా ఉంటామని ట్రంప్ పేర్కొన్నారు.ఈ తరహా అంతరిక్ష ప్రయాణాలు భవిష్యత్ పరిశోధనలకు మార్గదర్శిగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరి ప్రయాణం సురక్షితంగా ముగిసినందుకు అంతరిక్ష పరిశోధనా రంగం హర్షం వ్యక్తం చేస్తోంది.