Sunita Williams safely return to Earth

Sunita Williams : సురక్షితంగా భూమికి చేరిన సునీతా విలియమ్స్

Sunita Williams : సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నవేళ.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ‘ఫ్రీడమ్‌’ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది.

సురక్షితంగా భూమికి చేరిన సునీతా

ఏకంగా 286 రోజులు అక్కడే

సునీత, విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్‌ నిక్‌ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ కూడా ఐఎస్‌ఎస్‌ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు- ఐఎస్‌ఎస్‌ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్‌ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్‌.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు

కాగా, తాజాగా భూమిపై దిగిన వ్యోమగాములను హ్యూస్ట్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడే వారికి డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా తెలిపింది. అన్‌ డాకింగ్‌ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వరకు అన్నీ అనుకున్నట్టు జరిగాయని వివరించింది. స్పేస్‌ ఎక్స్‌, నాసా సమిష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని తెలిపింది. ఈ యాత్రను సక్సెస్‌ చేయడంలో స్పేస్‌ఎక్స్‌ కీలక పాత్ర పోషించిందని నాసా ప్రశంసించింది.

Related Posts
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
stock market

భారత స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. కొనుగోళ్ల అండతో నేడు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇయర్ ఎండింగ్ లో వరుస నష్టాలకు Read more

జనసేన ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అనే పేరు
janasena jayakethanam

జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న గ్రాండ్‌గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సభకు ‘జయకేతనం’ అనే పేరు జనసేన Read more

NarendraModi: క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామన్న మోదీ..
NarendraModi: క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటామన్న మోదీ..

మయన్మార్‌లో చోటుచేసుకున్న భారీ భూకంపం అనంతరం, భారత ప్రభుత్వం "ఆపరేషన్ బ్రహ్మ" పేరిట సహాయ చర్యలను ప్రారంభించింది. విపత్తు సహాయక సామగ్రిని, అత్యవసర సేవలను అందించేందుకు భారత Read more

నేడు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటన
CM Revanth Reddy visit to Karimnagar and Nizamabad districts today

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ తరఫున విస్తృత ప్రచారం హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *