Sunita Williams coming to India soon..!

Sunita Williams: త్వరలో భారత్‌కు రానున్న సునీత విలియమ్స్‌..!

Sunita Williams : దాదాపు తొమ్మిది నెల‌ల పాటు అంత‌రిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్‌కమ్‌ చెప్పింది.

త్వరలో భారత్‌కు రానున్న సునీత

స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు

ఇక సునీత సురక్షితంగా భూమికి చేరడంతో భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గుజ‌రాత్ రాష్ట్రంలోని ఝూలాస‌న్‌లో ఆమె బంధువులు, స్థానికులు బాణ‌సంచా కాల్చి నృత్యాలు చేస్తూ సంబ‌రాలు చేసుకున్నారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 286 రోజుల తర్వాత సునీత సేఫ్‌గా భూమిపైకి రావడంపై ఆమె సోదరి ఫాల్గుణి పాండ్యా సంతోషం వ్యక్తం చేశారు. సునీత కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

సునీత త్వరలోనే భారత్‌కు

ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వానికి, నాసాకు కృతజ్ఞతలు తెలిపారు. సునీత త్వరలోనే భారత్‌ కు రానున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.ఓ జాతీయ మీడియాతో ఫాల్గుణి మాట్లాడుతూ.. తొమ్మిది నెలల విరామం తర్వాత సునీత సురక్షితంగా భూమిపైకి రావడం సంతోషంగా ఉంది. ఆమె పుడమిపైకి దిగిన క్షణాలు అపురూపం. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ధైర్యంగా ఎదుర్కోగలదు. సునీత త్వరలోనే భారత్‌కు రానున్నారు. మేమంతా వెకేషన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాం. కుటుంబ సభ్యులతో చాలా సమయం గడపబోతున్నాం అని తెలిపారు.

Related Posts
చంద్రబాబు పవన్ లపై ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
సునీల్ కుమార్ సస్పెన్షన్ పై ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఐడీ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ సస్పెన్షన్‌పై తీవ్ర రాజకీయ చర్చలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సునీల్‌ కుమార్‌ ప్రభుత్వ అనుమతి Read more

South Korea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం.. 24 మంది మృతి
దక్షిణ కొరియాలో కార్చిచ్చు బీభత్సం.. 24 మంది మృతి

దక్షిణ కొరయాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇళ్లు, చెట్లను దహించివేస్తూ.. ఉవ్వెత్తున మంటలు ఎగిసిప డుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి Read more

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో ఊరట
gaddamprasad

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో Read more

త్రివేణి సంగమంలో అమిత్‌షా పవిత్ర స్నానం
amit shah

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 'మహాకుంభ్‌' లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు పాల్గొన్నారు. గంగా, యుమనా, సరస్వతీ నదులు సంగమించే త్రివేణి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *