Sunil Yadav ‘హత్య’ సినిమాపై సునీల్ యాదవ్ ఫిర్యాదు ఒకరు అరెస్ట్

Sunil Yadav: ‘హత్య’ సినిమాపై సునీల్ యాదవ్ ఫిర్యాదు ఒకరు అరెస్ట్

Sunil Yadav: ‘హత్య’ సినిమాపై సునీల్ యాదవ్ ఫిర్యాదు ఒకరు అరెస్ట్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తాజాగా ‘హత్య’ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడ్రోజుల క్రితం కడప ఎస్పీని కలిసి దీనిపై ఫిర్యాదు చేసిన సునీల్, నిన్న వేకువజామున తల్లితో కలిసి పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ మురళీ నాయక్‌కు మళ్లీ ఫిర్యాదు చేశాడు.

Sunil Yadav ‘హత్య’ సినిమాపై సునీల్ యాదవ్ ఫిర్యాదు ఒకరు అరెస్ట్
Sunil Yadav ‘హత్య’ సినిమాపై సునీల్ యాదవ్ ఫిర్యాదు ఒకరు అరెస్ట్

‘హత్య’ మూవీ దర్శకుడు, నిర్మాతలపై కేసు

సునీల్ ఫిర్యాదుతో ‘హత్య’ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయితలపై కేసు నమోదు చేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ‘వైఎస్ అవినాష్ రెడ్డి అన్న యూత్’ అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి వైరల్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అలాగే, వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. మరికొందరి పేర్లను కూడా ఈ కేసులో నమోదు చేసినట్టు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్

ఈ కేసు నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పోలీసు అధికారులు పవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కడప సైబర్ క్రైం స్టేషన్‌లో విచారణ అనంతరం పులివెందులకు తరలించారు. ఈ వ్యవహారం కడప జిల్లాలో పొలిటికల్ సెన్సేషన్గా మారింది. 39 నెలల రిమాండ్‌లో ఉన్న సునీల్ యాదవ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసి 39 నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఇప్పుడు ‘హత్య’ సినిమా వివాదం మరోమారు సునీల్ యాదవ్ పేరు వార్తల్లోకి తెచ్చింది.

Related Posts
గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్
Center is good news for Gun

NDA తో టీడీపీ జత కట్టడం తో ఏపీకి వరుస గుడ్ న్యూస్ అందజేస్తుంది కేంద్రం. ముఖ్యంగా రాష్ట్రానికి నిధుల సమస్య అనేది లేకుండా అవుతుంది. రాజధాని Read more

ఏపీఎస్ఆర్టీసీ శివరాత్రి ఆఫర్
Mahashivaratri 2025

మహాకుంభమేళా వేడుకల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రాజమండ్రి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18న ప్రత్యేక బస్సు ప్రారంభం కానుంది. ఈ బస్సు Read more

నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
CM Chandrababu is coming to Hyderabad today

హైదరాబాద్‌: ఈరోజుఉదయం హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. శంషాబాద్ లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించునున్నారు. ఇవాళ Read more

డిసెంబరు 16 నుండి ధనుర్మాసం ఆరంభం
danurmasam

✍️డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం 👉డిసెంబరు 17వ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై తిరుమల:తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *