Village Justice: అమరావతి నగరంలోని విశ్రాంత అటవి ” శాఖాధికారి రాఘవయ్యగారి ఇంటి అరుగుపై ఆ వాడ కట్టులోని పిల్లలందరు చేరారు.
పిల్లలందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్యగారు” మీ అందరికి ఈ రోజు ఒక కథ చెపుతాను” అన్నాడు.
Village Justice: పిల్లలు “సరే” అని తలలు ఊపారు.
పూర్వం శివయ్య అనే అమాయకుడు ఉండేవాడు. ఒకరోజు తన తమ్ముడిని చూడటానికి పొరుగూరు నడక మార్గంలో వెళ్లసాగాడు. అలా వెళుతూ చాలా దూరం ప్రయాణించి, చేరవలసిన ఊరుని చేరుకొని ఒక చెట్టుకొమ్మ నీడన తలపాగా పరుచుకుని తన వెంట తెచ్చుకున్న ఆహారం తిని నీళ్లు తాగి అక్కడే ‘నిద్రపోయాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి తట్టి నిద్ర లేపి-“ఏమయ్యా బాటసారీ! డబ్బు చెల్లించకుండా మా ఇంటి చెట్టు నీడ ఎలా వాడుకుంటున్నావు? అయిదు రూపాయిలు చెల్లించు” అన్నాడు ఆ వ్యక్తి.


“ఏమిటీ? రోడ్డు పైకి వచ్చిన మీ ఇంటి చెట్టు కొమ్మ నీడకు డబ్బులు చెల్లించాలా?” అన్నాడు శివయ్య.
“అవును” అన్నాడు. ఆ వ్యక్తి “సరే! నా దగ్గర డబ్బు లేదు. ఇక్కడికి దగ్గరలో మా తమ్ముడు పూల అంగడి నడుపుతున్నాడు. నాతో రండి వాడి దగ్గర డబ్బు తీసుకొని ఇస్తాను” అన్నాడు శివయ్య. అతని వెంట వచ్చిన వ్యక్తి శివయ్య తమ్ముడి అంగడి చేరిన వెంటనే అక్కడి కూజాలోని నీళ్లు ఒక గ్లాసులోకి వంపుకొని తాగాడు ఆ వ్యక్తి.
విషయం అంతా విన్న శివయ్య తమ్ముడు “అయ్యా, రోడ్డు ” పైకి వచ్చిన మీ ఇంటి చెట్టుకొమ్మ కింద మా అన్నగారు నిద్రించినందుకు డబ్బులు అడగటం న్యాయమే.
అలాగే ఇస్తాను. నా అంగడిలోని పువ్వుల పరిమళం మీరు పీల్చుకున్నందుకు వది రూపాయిలు, నా నీళ్లు తాగినందుకు పది రూపాయిలు మర్యాదగా ఇవ్వండి” అన్నాడు.

“ఏమిటీ? ఉచితంగా లభించే నీటికి, పూలపై నుండి వచ్చే వాసనకి డబ్బు చెల్లించాలా?” అన్నాడు ఆ వ్యక్తి.
“మీ ఇంట్లో ఉచితంగా మొలచి రోడ్డు పైకి వచ్చిన చెట్టుకొమ్మ నీడకే అయిదు రూపాయిలు మీరు తీసుకుంటే పది వేల రూపాయల పువ్వులు, వంద రూపాయల ఖరీదు చేసే కూజా, ఇరవై రూపాయల లోటా కొని, రోజు మంచి నీళ్లు తెచ్చిపోసేవారికి నెలకు వంద రూపాయలు చెల్లించే నేను వాటికి డబ్బు అడగటం అన్యాయం ఎలా అవుతుంది? న్యాయాధికారి (Magistrate) వద్దకు వెళదాం పదండి” అన్నాడు. అమాయకుడిని మోసగించబోయి తానే మోసపోయిన ఆ వ్యక్తి శివయ్య తమ్ముడికి అడిగినంత డబ్బులు చెల్లించి ఇంటిదారి పట్టాడు.


Village Justice: “బాలలూ.. కథ విన్నారుగా! ఎవరినైనా మోసగించాలని ప్రయత్నిస్తే మనమే మోసపోతామని తెలుసుకున్నారు కదా. కనుక ఎప్పుడూ ఎవరినీ మోసగించే ప్రయత్నం చేయకండి” అన్నాడు రాఘవయ్యతాత. బుద్ధిగా తలలు ఊపారు పిల్లలందరు.