Nepal Earthquake: నేపాల్ ని కొన్ని శతాబ్దాల పాటు రాజులే పాలించారు. అయితే ఆ తర్వాత రాజు ప్రధాన ప్రధానమంత్రి పరిపాలకుడుగా నేతృత్వంలో పాలక ప్రభుత్వం ఏర్పడింది.
దశాబ్దం క్రితం రాజును ఆయన కుటుంబాన్ని రాజవంశీయులే హత్యచేయడం తీవ్ర సంచలనం కలిగించింది. అప్పటి రాజుగారి తమ్ముడు బీరేంద్ర రాజుగా అధికారంలోకి వచ్చాడు.
ఒకప్పుడు నేపాల్లో పన్నెండు యేళ్ల పాటు ఘోరమైన క్షామం వచ్చింది.
దానివల్ల దేశం నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పటి నేపాల్ ప్రభువైన రాజా నరేంద్రదాస్ క్రీ.శ.347లో అస్సాంకు వెళ్లి ఒక మహాత్ముడైన బౌద్ధ భిక్షువును ఆహ్వానించి తీసుకువచ్చాడట.
ఆయన ఆగమనానికి సంతోషిస్తూ బ్రహ్మ వేదగానం చేస్తూ నగర వీధులను శుభ్రం చేశాడట. విష్ణుమూర్తి శంఖం పూరించాడట. మహాదేవుడు పురవీధులపై నీళ్లు చల్లాడట. ఇంద్రుడు గొడుగు పట్టాడట. యముడు ధూపం వేస్తే, కుబేరుడు సంపదలు వెదజల్లాడట.
అగ్నిదేవుడు దీపాన్ని వెలిగించగా వాయుదేవుడు విజయకేతనం ఎగిరేలా చేశాడు. ఆయన రాకతో పుష్కలంగా వర్షం కురిసి దేశం కరువు బారినుండి బయట పడినట్లు తెలుస్తోంది.
ఆ శుభ సంఘటనకు గుర్తుగా రాజా నవీంద్రదాస్ మచ్చీంద్రనాథుని ఆలయం నిర్మించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించాడట. ఇప్పటికీ యేటేటా వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
రాజకుటుంబం హత్యకు గురికావడం నేపాల్లో జరిగిన దురదృష్టకర సంఘటన. తర్వాత అక్కడ రాజకీయాలు అనేక ఆటుపోట్లకు గురయ్యాయి. అన్నిటికన్నా ఘోరమైన విపత్తు ఇటీవల సంభవించిన నేపాల్ భూకంపం.

నేపాల్ భూకంప ప్రభావం
ఈ భూకంపం ధాటికి జనవాసాలేకాక అనేక చారిత్రక కట్టడాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్ద ఆలయాలు దెబ్బతిన్నాయి.
అనేకమంది తమ ఇళ్లు, ఆస్తులు కోల్పోయారు. ప్రపంచ దేశాలు కొన్ని
ఈ ఘోరవిపత్తు నుండి నేపాల్ను రక్షించడానికి తమవంతు సాయం చేశాయి. అయినా ఇప్పటికీ ఆ భూకంపం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సంఘటనల్లో భారత ప్రభుత్వం నేపాల్కు ఆర్థిక సహాయం అందించడమేగాక పునరావాస కార్యక్రమాల్లో ఎంతగానో తోడ్పడింది.
ఖాడ్మండులో పశుపతినాథ దేవాలయం, గుహ్యేశ్వరి ఆలయం, ఇతర ఆలయాలను దర్శించే పర్యాటకులు బౌద్ధనాథ్ ఆలయాన్ని కూడా దర్శిస్తారు. ఈ బౌద్ధనాథ స్థూపం బౌద్ధులు నిర్మించిందే. భారతదేశంలోనే బౌద్ధం ఆవిర్భవించింది. మహాయోగి ప్రపంచం మహోన్నత అవతారంగా భావించే గౌతమబుద్ధుడి సూత్రాలతోనే

బౌద్ధమతం ఏర్పడిరది. ఆనాటి రాజులు అశోకచక్రవర్తి అజాతశత్రువు, హర్షుడు వంటి చక్రవర్తులు బౌద్ధమత వ్యాప్తికి తీవ్ర కృషి చేశారు. భారతదేశంలో పుట్టిన బౌద్ధం ఇతర దేశాలకు వ్యాపించింది. కొన్ని దేశాలలో బౌద్ధమతం (Buddhism) ముఖ్యమైనదిగా నేడు కొనసాగుతున్నది.
ఖాడ్మండుకు పశ్చిమంగా రెండు మైళ్ల దూరంలో కొండ మీద బౌద్ధ మందిరం ఉంది. ఇక్కడే స్వయంభూనాథ్ స్థూపం ఉంది. దాదాపు 4 వందల దాకా మెట్లు ఉంటాయి. సుమారు 20 అడుగుల దిబ్బమీద ఇక్కడ 45 అడుగుల ఎత్తు శివలింగం కనిపిస్తుంది. ఈ లింగం అడుగుభాగం చతురస్రాకారంలోఉంటుంది.
నాలుగు వైపులా త్రినేత్రాలుంటాయి. ఖాడ్మండులోని అనేక ప్రాంతాల వరకు ఈ కళ్లు కనిపిస్తుంటాయి. దీని చుట్టూ చిన్న పెద్దవి అయిన అనేక బౌద్ధ స్థూపాలు మందిరాలు ఉంటాయి.
ఇక్కడ బౌద్ధులే గాక హిందువులు కూడా ఏ తారతమ్యాలు లేకుండా పూర్వంనుంచి ఒకే చోట బుద్ధుడి ఆరాధన శివపూజలు చేస్తున్నారని ప్రసిద్ధ యాత్రికుడు హ్యూయన్సాంగ్ తన గ్రంథంలో తెలిపాడు. ఇప్పటికీ ఇక్కడ సామరస్యపూర్వక భక్తివాతావరణం కనిపిస్తుంది.
ఈ స్వయంభూనాథ స్థూపం క్రీ.శ. 5వ శతాబ్దంనాటికే ప్రసిద్ధ యాత్రాస్థలం. 15వ శతాబ్దికి చెందిన స్వయంభూ పురాణంలో ఈ `స్థలానికి సంబంధించిన అనేక కథలున్నాయి.
నేపాల్ పుట్టుక గురించి కూడా అనేక పురాణ గాథలున్నాయి. స్వయంభూ పురాణం ప్రకారం పూర్వం నేపాల్ లోయ దట్టమైన అరణ్యాలు పర్వతాలతో కూడిన అగాథమైన సరస్సు. ఆ సరస్సు పేరు నాగవాస సరోవరం.

ఈ సరోవరం అనేక పక్షులు లతలకు చెట్లకు నిలయంగా ఉండేదట. అయితే ఈ సరస్సులో పద్మాలు ఉండేవి కావట.ఒకసారి విపాసీబుద్ధుడు తన శిష్యులతో దేశాటన చేస్తూ ఈ సరోవర తీరానికి వచ్చి విడిది చేశాడు.
ఒకనాడు ఆయన ఈ సరస్సులో స్నానం చేసి సరస్సుకు మూడు సార్లు ప్రదక్షిణ చేసి దానికి నైరుతి వైపు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఒక తామరదుంపను తీసుకుని మంత్రించి ఆ సరస్సులోకి విసిరేసి ఏ రోజైతే ఈ పూస్తుందో ఆ రోజున అగ్ని స్థభువన నాథుడైన స్వయంభూదేవుడు ఈ పద్మంలో అవతరిస్తాడు. అగ్నిజ్వాల రూపంలో ప్రత్యక్షమౌతాడు. అప్పటి నుంచి ఈ సరస్సు సశ్యశ్యామలమై జనవాసంగా మారిపోతుంది” అని వక్కాణించాడు. తర్వాత కొద్ది కాలానికే నేపాల్రాజ్యం ఆవిర్భవించింది.