రాజపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. అందులో వరి పంట వేశాడు రైతు. బాగా వంట పండింది. రైతుకి మంచి లాభం వచ్చింది. తరువాత ఏడాది కూడా పంట బాగా పండింది. అయినా రైతుకు దిగుబడి లేదు. దానికి కారణం ఎలుకలు, పక్షులు పంటని తినడం గ్రహించాడు ఆ రైతు. అప్పుడు ఒక వలని పైరుపైన వేశాడు రామయ్య. ఎప్పటిలాగే ఎలుకలు, ముంగిసలు, పక్షులు ఆ పంట దగ్గరకు వచ్చాయి. ఎలుకలు ఎక్కువగా ఉండడం చూసి ఒక పిల్లి ఆ స్థలానికి వచ్చింది. ఆ పిల్లి రైతు వేసిన వలలో చిక్కుకుంది. ఒక చిట్టెలుక చిన్న రంధ్రం నుండి వచ్చి ధాన్యం తినటానికి పంట దగ్గరికి వెళ్లింది. అక్కడ పిల్లిని చూసి భయపడి దాని రంధ్రంలోకి వెళ్లి దాక్కోవాలనుకుంది.

కానీ ఆ కన్నం దగ్గర ముంగిస ఉంది. పోనీ 3 ఇంకో పక్కకు వెళ్లామంటే చెట్టుపైన కాకి ఒకటి ఉంది. ఎటు వెళ్లినా ప్రమాదమే అని ఆ చిట్టెలుక తెలివిగా ఆలోచించింది. పిల్లివైపు చూసింది చిట్టెలుక. ఈ పిల్లి నాకు శత్రువే కానీ వలలో చిక్కుకుంది నన్నేమీ చేయలేదు.
పిల్లి అంటే కాకికి, ముంగిసకి భయమే. అందుకు నేను పిల్లితో స్నేహం చేస్తా అని పిల్లి దగ్గరకు వెళ్లింది. ‘అయ్యో! పిల్లి బావ వలలో చిక్కుకున్నావా?’ అంది. అందుకు ‘అవును చిట్టి మరదలా! నువ్వు ఈ వలను కొరికి రైతు వచ్చేలోపల నన్ను రక్షించు’ అన్నది పిల్లి. ‘హా! అలాగే బావ!’ అని క్షేమ సమాచారమంతా అడుగుతుంది. నెమ్మదిగా వలను కొరుకుతుంది.
వేగంగా వలను కొరికితే ఈ పిల్లి నన్ను తినేస్తుంది అని ఆలోచించింది ఎలుక. వలను మెల్లమెల్లగా కొరుకుతూ రైతు రావడం చూసి, అతను వచ్చేసరికి వల నుండి పిల్లిని విడిపించింది. రైతు వచ్చి కర్రతో పిల్లిని కొట్టాలనేసరికి.. పిల్లి, ఎలుక, ముంగిస, కాకి

అన్ని పరుగున పారిపోయాయి. హమ్మయ్య అనుకుంది చిట్టెలుక. ‘చిట్టెలుక! నువ్వు చిన్న జీవివే అయినా సమయస్ఫూర్తితో నన్ను కాపాడావు. శక్తితో నిమిత్తం లేకుండా నీమీద నువ్వు నమ్మకంతో అపాయంలో మంచి ఉపాయం ఆలోచించావు. ఎవరికైనా ఆపద సమయంలో కావాల్సింది అదే’ అన్నది పిల్లి. ఇంకా మిగతా పక్షులు, ఎలుకలు, ముంగిసలు అభినందనలతో ముంచెత్తాయి చిట్టెలుకను.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: