“Victory and defeat: అడవికి రాజైన సింహం, ఉదయమే నిద్ర లేచి బద్దకంగా ఒళ్లు జయాప విరుచుకుంది. సింహానికి గడ్డం చెయ్యటానికి కుందేలు వచ్చి వినయంగా బయట నిలబడింది. చిన్నా, పెద్దా జంతువులకు క్షవరం, గడ్డం చేస్తుంటుంది కుందేలు.(rabbit) సింహం బయట అలికిడి వినిపించి “ఎవరక్కడ?” అని గర్జించింది. ఒకింత భయంగా, వినయంగా కుందేలు “మహారాజా! నేను కుందేలును. మీకు గడ్డం చేద్దామని వచ్చాను” అంది. “త్వరగా వచ్చి గడ్డం చెయ్యి” అంది, సింహం.(lion) కుందేలు లోపలికి వచ్చి “మహారాజులకు వందనాలు” అంది. “త్వరగా కానీ, ఈరోజు నేను వేటకు వెళ్లాలి” అంది సింహం. కుందేలు కత్తి, కత్తెర బయటకు తీసింది. నీట్ గా గడ్డం చేసి వెళ్లిపోయింది. మందీ మార్బలంతో కలిసి సింహం వేటకు బయలుదేరింది. సింహం గాండ్రింపులు, అడవికుక్కల అరుపులు, నక్కా మొదలైన జంతువుల అడుగుల శబ్దంతో టప టప రెక్కలు కొట్టుకుంటూ గాల్లోకి లేచాయి పిట్టలు. చిన్నా పెద్ద జంతువులు భయంగా పరుగులు పెడుతున్నాయి.
సింహం తిరిగి తిరిగి అలసిపోయింది. ఆరోజు ఒక్క జంతువూ దొరకలేదు. ఆకలితో నకనకలాడుతూ అంతఃపురం చేరింది సింహం. “ఈరోజు ఒక్క జంతువూ దొరకలేదు. పొద్దున్నే ఎవరి మొహం చూసానో!” అనుకుంది.

అంతలో పొద్దున్నే గడ్డం చెయ్యటానికి వచ్చిన కుందేలు గుర్తుకొచ్చింది. కోపంలో రగలిపోయి నక్కని పిలిచి “కుందేలుని పట్టుకురాపో” అంది సింహం. నక్క కుందేలు కబురు పంపింది, భయం భయంగా వచ్చి కుందేలు సింహం ముందర నిలుచుంది. “పొద్దున్నే నీ ముఖం చూసాను, అడవిలో ఒక్క జంతువూ దొరకలేదు. అందుకే నిన్ను చంపాలనుకుంటున్నాను” అంది సింహం. “మీరు నా ముఖం చూస్తే మీకు ఒక్క జంతువూ దొరకలేదు. నేను మీ ముఖం చూసినందుకు నన్ను చావు వరించబోతోంది” అంది.

కుందేలు సమాధానానికి బిత్తరపోయింది సింహం. నక్క కల్పించుకుని “మహారాజా! ముఖం చూడటం వల్ల లాభం, నష్టం ఉండవు. మన కృషిని బట్టి జయాపజయాలు లభిస్తాయి” అని అంది.
Read also: hindi.vaartha.com
Read also: Humanity Wins: నిజమైన అభిమానులు