Meal Maker Masala Vada Recipe in Telugu :
సోయా గ్రాన్యూల్స్(Meal Maker Masala Vada Recipe) (మిల్మేకర్) తో తయారయ్యే ఈ మసాలా వడలు రుచికరమైన స్నాక్. సాయంత్రం టీ టైమ్ కు గానీ, పార్టీలకు గానీ సింపుల్ గా చేసుకోవచ్చు. ప్రోటీన్లు, మసాలాల రుచులు కలసి వచ్చే ఈ వడలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పెరుగు లేదా చట్నీతో వేడి వేడి గా వడ్డిస్తే మరింత టేస్టీగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు:
- సోయా గ్రాన్యూల్స్ (మీల్ మేకర్) – 1 కప్పు
- ఉల్లిగడ్డ – 1 (తరిగినది)
- పచ్చిమిర్చి – 4 (సన్నగా తరిగినవి)
- అల్లం – అంగుళం ముక్క (తురుము)
- వెల్లుల్లి రెబ్బలు – 5 (తురుము)
- కరివేపాకు – 2 రెబ్బలు
- నూనె – వేయించడానికి సరిపడినంత
- ఉప్పు – తగినంత
- కొత్తిమీర తురుము – కొద్దిగా
- శనగపప్పు – 1/4 కప్పు (నానబెట్టినది)
- శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
- కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
- ధనియాలు – 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర – 1 టీస్పూన్
- దాల్చిన చెక్క – అంగుళం ముక్క
- లవంగాలు – 6
తయారు చేసే విధానం:
ముందుగా సోయా గ్రాన్యూల్స్(soya Chunks) లో కొద్దిగా ఉప్పు వేసి వేడినీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. తర్వాత నీటిని పిండేసి పక్కన పెట్టుకోవాలి.ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు బరువుగా పొడి చేసుకోవాలి.ఒక పెద్ద గిన్నెలో సోయా గ్రాన్యూల్స్, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర, తయారుచేసిన మసాలా పొడి వేసి బాగా కలిపుకోవాలి.ఇప్పుడు అందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేతిలో వడలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగులో వేయించాలి. మిల్మేకర్ మసాలా వడలు సిద్ధం!






Read also: mullangi paratha recipe: ముల్లంగి పరోటా