మామిడి-బొప్పాయి సలాడ్ | Mango Papaya Salad Recipe in Telugu
తాజా మామిడి, బొప్పాయి ముక్కలతో, పల్లీలు, నువ్వులు, మసాలా టచ్ తో తయారయ్యే ఈ సలాడ్ ఆరోగ్యకరమైనటూ, రుచికరమైనటూ ఉంటుంది. తక్కువ కాలరీలు, ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండే ఈ సలాడ్ లంచ్ లేదా స్నాక్ టైమ్ కు అద్భుతమైన ఎంపిక.
కావలసిన పదార్థాలు:
- మామిడి ముక్కలు – 1 కప్పు (సన్నగా తరిగినవి)
- బొప్పాయి ముక్కలు – 1 కప్పు (సన్నగా తరిగినవి)
- పచ్చిమిర్చి – 2 (చిన్నగా తరిగినవి)
- కొత్తిమీర తురుము – 1 టీస్పూన్
- వేయించిన పల్లీలు – 1/4 కప్పు
- ఉప్పు – తగినంత
- ఆలివ్ ఆయిల్ – 2 టీస్పూన్లు
- మిరియాల పొడి – 1/4 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 4 (తురిమినవి)
- తెల్ల నువ్వులు – 2 టీస్పూన్లు
తయారు చేసే విధానం:
Mango Papaya Salad Recipe: ఒక గిన్నెలో మామిడి మరియు బొప్పాయి ముక్కలు వేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, వేయించిన పల్లీలు, తగినంత ఉప్పు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, తురిమిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి.చివరగా నువ్వులు వేసి మరోసారి కలిపితే, రుచికరమైన మామిడి-బొప్పాయి సలాడ్ సిద్ధం. ఈ సలాడ్ ను స్నాక్ గానీ, సైడ్ డిష్ గానీ, వెజ్ లంచ్ లో భాగంగా తీసుకోవచ్చు. తక్కువ కాలరీలు, అధిక పోషక విలువలతో ఈ సలాడ్ ఆరోగ్యానికి మంచిది.







Read Also: Beetroot Kurma Recipe : బీట్‌రూట్ కుర్మా