
jokes: సమయాన్ని సరదాగా మార్చే నవ్వుల జోక్స్ (jokes)కలెక్షన్. కొత్త కొత్త హాస్య చినుకులు, కుటుంబంతోనూ స్నేహితులతోనూ పంచుకోవడానికి సరైన జోక్స్.
రవి & రంగ:
రవి: డెబ్బై సంవత్సరాలు దాటిన మీ తాతయ్య ఏం చేస్తున్నాడురా?
రంగ: గవర్నర్ పదవి కోసం ఎదురు చూస్తున్నాడురా! ????
టీచర్ & గిరి:
టీచర్: పిల్లల పుట్టిన రోజుకు పెద్దలను ఎందుకు పిలుస్తార్రా?
గిరి: ముద్దులు పెడతారని. ????

టీచర్ & భాస్కర్:
టీచర్: భాస్కర్, చదువుకునేటప్పుడు నీకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదుగా. ఇప్పుడు ఏం చేస్తున్నావురా?
భాస్కర్: తెలుగు సినిమాలకు పాటలు రాస్తున్నాను టీచర్. ????
తల్లి & చింటూ:
తల్లి: చింటూ, ఏం చేస్తున్నావురా?
చింటూ: మందుబిళ్లలకి సైడ్లు కట్ చేస్తున్నానమ్మా!
తల్లి: ఎందుకురా?
చింటూ: సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వుండటానికి! ????

రాము & రాధా:
రాము: నా జన్మ ధన్మమయింది రాధా.
రాధా: ఎందుకు అలా అంటున్నావు?
రాము: నన్ను చూసి కన్ను కొట్టావుగా.
రాధా: నీ మొహం… నీకు అంత సీన్ లేదులే.
రాము: ఎందుకు? నాకేం తక్కువైంది??
రాధా: నా కంట్లో నలక పడింది. ఆ బాధ తట్టుకోలేక కన్ను కొట్టాను. ????
విజ్జి & నాని:
విజ్జి: “యావండీ! ఈ మధ్య ఎక్కువ టీ తాగుతున్నారు. నేను చేసే టీ అంత బాగుంటోందా?”
నాని: “అది కాదు విజ్జీ, డాక్టర్ ఎక్కువగా వేడి నీళ్లు తాగమన్నారు”. ????

రామారావు & ఎస్సై:
రామారావు: “ఎస్సై గారూ, నన్ను ఎలాగైనా రక్షించండి. నా భార్యని కత్తితో పొడిచాను”.
ఎస్సై: “ఆమె చనిపోయిందా?”
రామారావు: “ఆమె చనిపోలేదు సార్, అదేగా నా భయం!” ????
అనిల్ & ప్రదీప్:
అనిల్: “ఏరా ప్రదీప్, విజ్జికి మొబైల్ కొనిచ్చావుగా. మళ్లీ వాపస్ తీసుకుంటున్నావు, ఎమైంది?”
ప్రదీప్: “నేను ఎప్పుడు ఫోన్ చేసినా అవుటాఫ్ కవరేజి అనో లేదా మరో లైన్ లో బిజీ అని వస్తోంది”. ????

???? డాక్టర్ & భార్య:
డాక్టర్: “అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎందుకు ప్రార్థించావు?”
భార్య: “అందులో తప్పేముంది? మంచి విషయమేగా!”
డాక్టర్: “నేను డాక్టర్ నన్న విషయం నువ్వు మరిచిపోయినట్లున్నావు”. ????

భర్త & భార్య:
భర్త: “ఐదు సంవత్సరాల క్రితం మనం చాలా సంతోషంగా ఉన్నాం”.
భార్య: “అదేమిటి? మనకి పెళ్లి అయి నాలుగు సంవత్సరాలే కదా అయింది?”
భర్త: “నేను కూడా అంటున్నాను. అయిదు సంవత్సరాల క్రితం మనం చాలా హ్యాపీ కదా!” ????