బెంగళూరు సవనగుడి ప్రాంతంలో కొలువైన స్వామిని దొడ్డ గణపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలోని విగ్రహం చాలా పెద్దది. (big) అర్చకులు నిచ్చెన ఎక్కి స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తారు. ప్రతి బుధవారం(wednesday) స్వామివారిని వెన్నతో అలంకరిస్తారు. ఈ దేవాలయంలో నారికేళం స్వీకరించి ఇరవై ఒక్క నెలలు సంకష్ట హరగణపతి వ్రతం చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

కోలార్ మరియు గోకర్ణం విగ్రహ విశేషాలు
కోలార్ జిల్లాలోని కురుడు మళెలో కొలువైన ఏకశిలా సాలిగ్రామ వినాయకుడు అత్యంత మహిమాన్వితుడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించుకుంటే ఉద్యోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉద్యోగం వచ్చిన తరువాత మరోసారి స్వామి దర్శనం చేసుకుంటారు. ఏదైనా ముఖ్యమైన పని మొదలు పెట్టాలంటే ముందుగా ఈ గణనాథుణ్ణి దర్శించుకుని భక్తులు ఆశీర్వాదం తీసుకుంటారు.

ఆత్మలింగం మరియు ప్రత్యేక విశేషాలు
ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోకుండా రావణుణ్ణి గణపతి ఆపిన స్థలమే గోకర్ణం. గణపతి ఆత్మలింగాన్ని నేలపై పెట్టినప్పుడు రావణుడికి కోపం వచ్చి ఓ మొట్టికాయ వేశాడట. ఇక్కడి గణపతి శిరస్సు పై చేతితో మొట్టిన గుర్తులు కనిపిస్తాయి. ఈ స్వామిని దర్శించితే జాతక దోషాలు పోతాయని భక్తుల నమ్మకం.
Read also: hindi.vaartha.com
Read also: