Bala Geyaalu: బాల గేయాలు

ఆటా పాట..!
అటా పాట ఉల్లాసం
ఆరోగ్యానికి ఉత్సాహం
ఆనందానికి ఆహ్లాదం
సంతోషానికి స్నేహం.
పున్నమి వెన్నెల్లో
చల్లని పొద్దుల్లో
ఎంచక్కా ఆడుదాం
తైతక్కలాడుదాం.
సంధ్యా సమయంలో
పిల్లగాలితో
సక్కంగా విహరిద్దాం
ఏకంగా కలిసుందాం.
పొద్దు పొడిచే వేళల్లో
పచ్చని పచ్చిక బయల్లో
పాటలు పాడుదాం
సంగీతం పలికిద్దాం.
ప్రకృతి ఒడిలో.
కమ్మని పచ్చదనంలో
ధ్యానంలో వుందాం
విజ్ఞానం పెంచుదాం.