Pushpa 2

Sukumar;పుష్ప 2 విషయంలో సుక్కు  అసంతృప్తిగా ఉన్నాడు,

సుకుమార్: పుష్ప 2 కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా సుకుమార్ మరియు ఆయన టీం అహర్నిశలు కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి, దీంతో ప్రేక్షకుల హైప్‌ను నిలబెట్టుకునే విధంగా సుకుమార్ సినిమా కోసం విపరీతంగా ప్లాన్ చేస్తున్నాడు.

Advertisements

అయితే, పుష్ప 2 విషయంలో సుకుమార్ కొంత అసంతృప్తితో ఉన్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 5న సినిమా విడుదల కావాల్సిన పరిస్థితులు రావడంతో, సుకుమార్ తన ఆలోచనలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయాడని అంటున్నారు. కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదని, అలాగే ఒక ప్రత్యేక గీతం కూడా చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో, ‘పుష్ప 2’ షూటింగ్‌ను వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది.

పుష్ప 1 తో పోల్చితే, పుష్ప 2 మరింత భారీ స్థాయిలో ఉండబోతుందని, పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు మరింత పెరిగాయని సమాచారం. సుకుమార్ ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాడట. అలాగే, సినిమాలోని ప్రత్యేక గీతం కోసం శ్రీలీలను తీసుకోవడం జరిగింది. ఆమె పుష్ప 2 లో తన డ్యాన్స్‌తో అదరగొడుతుందని, ఆ పాట అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు డిసెంబర్ 5వ తేదీ దగ్గరపడుతుండగా, పుష్ప 2 కోసం మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాస్ ఫీస్ట్ లభించనుంది. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుండగా, దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం మ్యూజిక్ లవర్స్ కు పండుగగా నిలుస్తుందని అంటున్నారు.

Related Posts
ఎన్టీఆర్‌, చిరంజీవికి సాధ్యం కానీ రికార్డ్‌
Actor Krishna

టాలీవుడ్ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించారు. అందులో ఒకటే, ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు చేయడం. 1972లో కృష్ణ గారు ఏకంగా Read more

ఇప్పటికి సమంతతో కాంటాక్ట్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో ,
samantha ruth prabhu

సమంత ఈ పేరు టాలీవుడ్‌లో ఎప్పుడూ హిట్. ఏం మాయ చేసావే సినిమాలో ఆమె మొదటిసారి కనిపించినప్పుడు, కుర్రకారులో ఎలాంటి సందడి ఏర్పడిందో మాటల్లో చెప్పలేం. సినిమాకు Read more

Release Clash : నితిన్ కు పోటిగా నాగ చైతన్య. చూస్కుందాం..!
nithin naga chitanya

పుష్ప - 2 విడుదల తేదీ ప్రకటించడం: టాలీవుడ్ లో అంచనాల నెల మంచి అభ్యర్థనతో కూడిన పుష్ప సీక్వెల్ పుష్ప - 2 డిసెంబరు 6న Read more

ఆర్జీవి మూవీస్ ఒక స్థాయిలో ఉంటాయి కానీ.
ఆర్జీవి మూవీస్ ఒక స్థాయిలో ఉంటాయి కానీ.

గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తీసిన సినిమాలు చూస్తుంటే, వాటిలో ఒక్కటి కూడా ప్రత్యేకంగా standout అవ్వలేదు.చాలా సినిమాలు సరిగ్గా ఏదో అర్థం Read more

×