Suchitra Ella appointed as honorary advisor to AP government

AP Govt : ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా సుచిత్ర ఎల్ల

AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు ప్రముఖులను గౌరవ సలహాదారులుగా నియమించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చెశారు. సుచిత్ర ఎల్లా కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చేనేత, హస్త కళల అభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తారు.

ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా

మరోవైపు డీఆర్‌డీవో మాజీ చీఫ్ జి.సతీష్‌రెడ్డిని ఏరో స్పేస్, డిఫెన్స్ తయారీ హబ్ గౌరవ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. అలాగే కేపీసీ గాంధీని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమించారు. శ్రీధర పనిక్కర్ సోమనాథ్‌ను స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నలుగురు సలహాదారులను రెండేళ్ల కాలానికి ప్రభుత్వం నియమించింది. వీరందరికీ కేబినెట్ ర్యాంకు ఉంటుంది. ప్రభుత్వం వీరి సలహాలను చేనేత, హస్తకళలు, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫోరెన్సిక్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగించుకుంటుంది.

ఏరో స్పేస్, డిఫెన్స్ తయారీ హబ్ గౌరవ సలహాదారుగా నియమితులైన జి.సతీష్‌రెడ్డి రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. ఆయన ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా ఉన్నారు. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటుకు సతీష్ రెడ్డి సలహాలు ఇస్తారు. AI, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డీప్‌టెక్‌లో కూడా ప్రభుత్వానికి సూచనలు అందించనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఏపీ ప్రభుత్వానికి సతీష్ రెడ్డి సలహాలు ఇవ్వనున్నారు. ఆయనకు కూడా ఏపీ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ కేటాయించింది.

ఇక, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా నియమితులైన కేపీసీ గాంధీకి కూడా కేబినెట్ ర్యాంక్ హోదాలో రెండేళ్ల పాటు విధులు నిర్వహించనున్నారు. ఇక శ్రీధర పనిక్కర్ సోమనాథ్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. ఆయన ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సోమనాథ్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించనున్నారు.

Related Posts
జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
జేసీకి బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. నటి, బీజేపీ నేత మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి Read more

అట్టహాసంగా నాగ చైతన్య – శోభిత వివాహం
chaitu shobitha wedding

డిసెంబర్ 04 బుధువారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో నాగ చైతన్య - శోభితల వివాహం అట్టహాసంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి Read more

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ
ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ ఏ Read more

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా భారత్‌ – మోదీ లక్ష్యం
గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా భారత్‌ మోదీ లక్ష్యం

భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేవ్స్ (WAVES) అడ్వైజరీ బోర్డ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *