దేశమంతా గురుపౌర్ణిమి వేడుకల్లో మునిగి ఉన్న ఈ సమయంలో హర్యానాలో ఓ దారుణ సంఘటన కలకలం రేపింది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్‌పాల్ (School Principal) ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి నరికి చంపారు (Minor students stabbed to death with knives). కేవలం క్రమశిక్షణ మాటలకే ఆగ్రహించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.హర్యానాలోని హిసార్ జిల్లా నర్నౌద్ పట్టణంలో ఉన్న బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. 50 ఏళ్ల ప్రిన్స్‌పాల్ జగ్బీర్ సింగ్ పన్నూ విద్యార్థులకు క్రమశిక్షణను నేర్పించాలన్న ఉద్దేశంతో, జుట్టు కత్తిరించుకొని రావాలని సలహా ఇచ్చారు. అయితే దీన్ని అవమానంగా తీసుకున్న ఇద్దరు విద్యార్థులు, ఆయనను టార్గెట్ చేశారు.

క్లాసులోకి వచ్చి నేరుగా దాడి
వెంటనే ప్రతీకార దృష్టితో ఉన్న ఇద్దరు మైనర్ విద్యార్థులు స్కూల్‌కు కత్తులతో వచ్చారు. ప్రిన్స్‌పాల్ క్లాసులో ఉండగానే, అతని మీద దాడికి దిగారు. పలు చోట్ల కత్తిపోట్లతో ఆయనను హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇది చూసిన స్కూల్ సిబ్బంది, విద్యార్థులు షాక్‌కు గురయ్యారు.
విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది
ఈ ఘాతుకానికి పాల్పడిన విద్యార్థులు ఘటన అనంతరం స్కూల్ నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఇద్దరు మైనర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారిని త్వరలో పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
పాఠశాలల భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటన స్కూల్ భద్రత, పిల్లల మానసిక స్థితిపై సుదీర్ఘ చర్చకు దారితీస్తోంది. విద్యార్థుల మనస్తత్వాన్ని, మారుతోన్న బుద్ధిని సమాజం కొత్త కోణంలో విశ్లేషిస్తోంది. గురుపౌర్ణిమి రోజే ఓ గురువు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. ఇది విద్యా వ్యవస్థలో భద్రతకు లొలికిన గొట్టమే.
Read Also : Kerala Student : రెండు విమానాల ఢీ..ఇద్దరు పైలట్ విద్యార్థుల మృతి