కొన్నిసార్లు పరిస్థితులు మన సంకల్పానికి పరీక్ష పెడుతుంటాయి. మంచి భవిష్యత్తు కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చదువుకోవాలనే సంకల్పంతో ఉన్న కొందరు విద్యార్థులు.. నదీలోయను దాటడానికి సైతం వెనుకాడట్లేదు. ప్రతిరోజు లోయను దాటుతూ స్కూల్‌కి వెళ్లి వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇలా రోజూ ట్రాలీపై ప్రయాణిస్తూ చదువును కొనసాగిస్తున్నారు. ఎలాంటి భయమూ లేకుండా, సునాయాసంగా వారు నదిని దాటడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాఖండ్ విద్యార్థులకు చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్‌లోని మున్సియారి గ్రామంలోని స్కూల్ గర్ల్స్.. స్కూల్‌కి వెళ్లడానికి ఎదురవుతున్న సవాళ్లను ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ‘త్రిభ్‌చౌహాన్’ అనే హ్యాండిల నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. నదీలోయను దాటడానికి ట్రాలీ లాగుతున్న విద్యార్థులను ఓ వ్యక్తి పలకరించాడు. అభివృద్ధి అంటే ఇలాగేనా ఉండేది? అనే మాటలతో వీడియో ప్రారంభం అవుతోంది. ‘2025లో కూడా మన వ్యవస్థ ఎలా ఉందో మీరే చూడండి. భేటీ బచావో, భేటీ పడావో వంటి పథకాలు ఎన్ని వచ్చినా కూడా బాలికల పరిస్థితి ఏం మారడం లేదు’ అంటూ చెప్పుకొచ్చి అక్కడున్న విద్యార్థులతో మాట్లాడటం మొదలు పెట్టాడు.
కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో, మేము మరణం నుండి తప్పించుకున్నాము అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. అధికారం నుంచి తప్పుకున్న తర్వాత తనపై, Read more
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లిన విషయం పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం Read more
న్యూఢిల్లీ: ఢిల్లీలో చలితో పాటు వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రమైన కేటగిరీకి చేరుకుంది. దీనికి సంబంధించి సోమవారం నుంచి Read more
మహా కుంభమేళా 2025 – విశేషాలు, షెడ్యూల్ & రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరు హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మేళాలలో మహా కుంభమేళా ప్రాముఖ్యత అంతాఇంతా Read more