Students of KLH Bachupally Campus who achieved excellence in displaying outstanding athletic talent

క్యాంపస్ విద్యార్థుల అథ్లెటిక్ ప్రతిభ

హైదరాబాద్: అత్యుత్తమ క్రీడా విజయాలు మరియు విద్యావిషయక విజయాలతో కూడిన ఒక సంవత్సరాన్ని కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ జరుపుకుంది. తామెంచుకున్న రంగాలలో రాణిస్తున్న విద్యార్థి-అథ్లెట్లకు ప్రోత్సాహక మైదానంగా ఈ క్యాంపస్ గుర్తించబడింది. ఈ సంవత్సరం, పలు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తోన్న తమ విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రదర్శింప చేస్తూనే వారికి స్ఫూర్తి కేంద్రంగా క్యాంపస్ నిలిచింది.

న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా మరియు పసిఫిక్ కప్ ఛాంపియన్‌షిప్ 2024లో 18 ఏళ్ల కళాత్మక రోలర్ స్కేటర్ పడిగా తేజేష్ అద్భుతమైన ప్రదర్శనకారుల సరసన నిలిచారు. తేజేష్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్‌లో బంగారు పతకం, సోలో డ్యాన్స్ స్కేటింగ్‌లో రజతం, క్వాడ్ ఫ్రీస్టైల్ ఆర్టిస్టిక్ రోలర్ విభాగంలో కాంస్యం సాధించారు . క్యాంపస్ యొక్క విజయాలకు మరింత వన్నె తెస్తూ , కెఎల్‌హెచ్‌ బాచుపల్లికి చెందిన అద్భుతమైన స్విమ్మర్ సాయి నిహార్, ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా గేమ్స్‌లో బంగారు పతకంతో పాటు వివిధ ఆల్ ఇండియా పోటీలలో రజతం మరియు కాంస్య పతకాలను సాధించాడు.

కెఎల్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్థ సారధి వర్మ ఈ విజయాలను కొనియాడుతూ.. “యూనివర్శిటీలో మా ఫిలాసఫీ సూటిగా ఉంటుంది: ఉద్దేశ్యంతో అభిరుచిని పెంపొందించడం ద్వారా గొప్పతనాన్ని సాధిస్తాము. తేజేష్, సాయిల విజయాలు, మరియు మా వివిధ క్యాంపస్ల నుండి అనేక మంది పట్టుదల, క్రమశిక్షణ మరియు సమతుల వృద్ధి యొక్క శక్తివంతమైన కలయికకు నిదర్శనం. వారి ఆశయాలకు మద్దతు ఇవ్వడం మరియు వారి విజయాన్ని వేడుక జరుపుకోవడం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాము” అని అన్నారు.

సౌత్ జోన్ పోటీలో బంగారు పతకాన్ని సాధించడమే కాకుండా ఆల్-ఇండియా ఇంటర్-యూనివర్శిటీ ఛాంపియన్‌షిప్ 2023-24లో రజత పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు టి . రాహుల్ ఆజాద్ వంటి ఇతర క్రీడా తారలు కూడా క్యాంపస్‌లో ఉన్నారు. అతని ఆదర్శప్రాయమైన ప్రదర్శన, విజయవాడలోని ఏజి కార్యాలయంలో గౌరవనీయమైన ప్రభుత్వ పదవిని సంపాదించిపెట్టింది. అదేవిధంగా, దీపికా మాడుగుల బ్యాడ్మింటన్‌లో రాణించి, సీనియర్ జాతీయ పోటీలో బంగారు పతకం మరియు దక్షిణ మధ్య రైల్వేలో వుద్యోగం సంపాదించింది.

సిహెచ్ ప్రణతి ఈ సంవత్సరం వివిధ రాష్ట్ర మరియు జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పదకొండు పతకాలను సాధించడం ద్వారా తన అసాధారణమైన రైఫిల్ షూటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అదనంగా, విశిష్ట టేబుల్ టెన్నిస్ ఆటగాడు అయిన వృషిన్, గత సంవత్సరం ప్రారంభంలో జరిగిన స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మరియు ఇంటర్నేషనల్ మెన్స్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించడం ద్వారా క్యాంపస్ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప చేసాడు. అతని విజయ పరంపర అంతర్జాతీయ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతంతో కొనసాగింది మరియు మిక్స్‌డ్ డబుల్స్ మరియు పురుషుల టీమ్ ఈవెంట్‌లో అదనపు కాంస్య పతకాలతో సంవత్సరాన్ని ముగించాడు.

డాక్టర్ ఎల్. కోటేశ్వరరావు, ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది, మరియు కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్‌లోని క్రీడా విభాగాధిపతి డాక్టర్. ఈ . రాజగోపాల్, వివిధ పోటీ స్థాయిలలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని స్థిరంగా ప్రోత్సహిస్తున్నారు మరియు విద్యార్థులు వారి అథ్లెటిక్ మరియు అకడమిక్‌ను సమర్థవంతంగా సమతుల్యం చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. కెఎల్‌హెచ్‌ క్యాంపస్ యువ క్రీడాకారులకు మద్దతు వ్యవస్థలను అందించడం ద్వారా అత్యుత్తమ సంస్కృతిని ప్రోత్సహిస్తూనే ఉంది, వారు మైదానంలో మరియు వారి విద్యాపరమైన ప్రయత్నాలలో తమ అత్యుత్తమతను సాధించేలా చూస్తారు.

కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ, హైదరాబాద్ మరియు విజయవాడలో క్యాంపస్‌లతో, టీచింగ్, రీసెర్చ్ మరియు నాయకత్వ అభివృద్ధిలో దాని శ్రేష్ఠత పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థగా తనను తాను తీర్చిదిద్దు కోవటానికి కట్టుబడి ఉంది. 25% నుండి 100% వరకు ట్యూషన్ మినహాయింపులను అందించే స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లను అందించడం ద్వారా విశ్వవిద్యాలయం విద్యార్థి అథ్లెట్లకు చురుకుగా మద్దతు ఇస్తుంది.

Related Posts
‘మయోనైజ్’ బిర్యానీ తిని ఒకరు మృతి..ఎక్కడంటే
Mayonnaise biryani

తెలంగాణలో మయోనైజ్ వినియోగంపై పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాదులో కలుషితమైన మయోనైజ్ వల్ల అనారోగ్యానికి గురైన 50 మందిలో ఒకరు ప్రాణాలు Read more

14వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2024’’నుప్రకటించిన నారెడ్కో తెలంగాణ
Naredco Telangana has announced the 14th Naredco Telangana Property Show 2024

మూడు రోజుల ప్రాపర్టీ షో 2024 అక్టోబర్ 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రారంభం.. హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన “నారెడ్కో తెలంగాణా Read more

ప్రధాని మోడీ “మన్ కీ బాత్” లో NCC, రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
pm modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్లీ రేడియో కార్యక్రమం "మన్ కీ బాత్" లో యువతను రాజకీయాలలో చేరాలని ప్రోత్సహించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ, "ప్రత్యేకంగా కుటుంబం లేదా Read more

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
KTR's petition in Supreme Court

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కేసు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ఉదయం తెలంగాణ హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను Read more