Student suicide in Sri Chaitanya College

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: షాద్ నగర్ కు చెందిన కౌశిక్ రాఘవ (17) హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడే హాస్టల్ గదిలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

Advertisements

కాగా, శ్రీచైత‌న్య క‌ళాశాల‌లో విద్యార్థుల‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నార‌ని, మాన‌సిక ఒత్తిడిని త‌ట్టుకోలేక విద్యార్థులు అర్థాంత‌రంగా త‌నువులు చాలిస్తున్నార‌ని న‌వ తెలంగాణ విద్యార్థి శ‌క్తి సంఘం అధ్య‌క్షుడు ప‌వ‌న్ ఆరోపించారు. కాలేజీ యాజ‌మాన్యంపై త‌క్ష‌ణ‌మే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు-రాధిక దంపతులకు కుమారుడు జశ్వంత్‌గౌడ్‌ (17)తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జశ్వంత్‌గౌడ్‌ నిజాంపేట్‌ జర్నలిస్టు కాలనీలోని శ్రీచైతన్య బాలుర వసతిగృహంలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి పడుకున్నాడు. నవంబర్‌ 14 గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తోటి విద్యార్థులు నిద్రలేచి చూడగా గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరి వేసుకొని వేలాడుతూ కన్పించాడు. విషయాన్ని కళాశాల వార్డెన్‌కు తెలుపగా వెంటనే నిజాంపేట్‌లోని హోలిస్టిక్‌ దవాఖానకు తరలించారు. అప్పటికే జశ్వంత్‌గౌడ్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు.

Related Posts
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి

టాలీవుడ్‌లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ Read more

ఈ రైళ్లు చర్లపల్లి నుంచి ప్రయాణం
ఈ రైళ్లు చర్లపల్లి నుంచి ప్రయాణం

తెలంగాణలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రస్తుతం భారీ అభివృద్ధి ప్రక్రియలో ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణను దృష్టిలో పెట్టుకుని, చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రధాన కేంద్రంగా Read more

Telengana: ఆత్మహత్యకు దారితీసిన సోషల్ మీడియా ప్రేమ..ఎక్కడంటే?
Telengana: ఆత్మహత్యకు దారితీసిన సోషల్ మీడియా ప్రేమ..ఎక్కడంటే?

ప్రేమలో పడటమే కాదు, జీవితాన్ని అనుభవించగలిగే తత్త్వం ఉండాలి. కానీ కొన్ని క్షణికావేశ నిర్ణయాలు, అనుభవం లేని వయస్సు కొన్ని ప్రాణాలను బలితీసుకుంటుంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో Read more

నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం
BRS BC

తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు బీఆర్‌ఎస్ కీలక చర్యలు చేపడుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, భవిష్యత్తు Read more

Advertisements
×