हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Shobha Rani
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ దీనికి తోడైంది. ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు.. తర్వాత భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,700 దిగువకు చేరింది. నిఫ్టీ ఆటో సూచీ 2 శాతానికి పైగా నష్టపోగా.. నిఫ్టీ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్‌ 100 సూచీ 1.62 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.94 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3.50 లక్షలు క్షీణించి రూ.440.23 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 82,116.17 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 81,153.70 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 872.98 పాయింట్ల నష్టంతో 81,186.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 261.55 పాయింట్ల నష్టంతో 24,683.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.63గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. ఎటర్నల్‌, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రభావాలు
అమెరికా ప్రభుత్వ అప్పులపై ఆందోళన నేపథ్యంలో యూఎస్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. దీంతో అక్కడి 30 ఏళ్ల బాండ్‌ రాబడులు 2023 నవంబర్‌ తర్వాత గరిష్ఠ స్థాయి అయిన 5.03 శాతానికి చేరాయి. బాండ్‌ రాబడులు పెరగడంతో భారత్‌ వంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు లిక్విడిటీ తగ్గొచ్చన్న భయాలతో మన మార్కెట్లు (Stock market) పడ్డాయి. గత కొన్ని రోజులుగా కొనుగోళ్లవైపు మొగ్గుచూపిన విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) మే 19న అమ్మకాలకు దిగారు. రూ.526 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం రూ.238 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు. భారత్-పాక్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం స్టాక్‌ మార్కెట్‌ సూచీలు దూసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో 4 శాతం మేర లాభపడ్డాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ వంటి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ముఖ్యంగా హాంకాంగ్‌, సింగపూర్‌లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో కొత్తగా కొవిడ్‌ కేసులు నమోదు కావడమూ మార్కెట్‌ నెగటివ్‌గా తీసుకుందని అనలిస్టులు భావిస్తున్నారు.

Read Also: Congress: అదానీ వ్యవహారం అతిపెద్ద కుంభకోణం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870