దేశీయ మార్కెట్లు (Stock Market) ఈ వారాన్ని స్తబ్దుగా ప్రారంభించాయి. సోమవారం ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతుండటంతో ఆ ప్రభావం మన సూచీలపైనా కనిపించింది. దాంతో అవి స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి.
అమెరికా-భారత్ వాణిజ్య చర్చలు కీలకం
ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 56 పాయింట్ల నష్టంతో 83,383 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 4 పాయింట్ల నష్టంతో 25,456 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.63 వద్ద ఉంది. బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10శాతం టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో రూపాయి విలువ క్షీణించింది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్,

ఐషర్ మోటార్స్, హెచ్‌యూఎల్, ఆసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, హిందాల్కో స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చల ఫలితం ఈ వారమే బయటకు రానున్నందున, దేశీయంగా ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com