State budget does not address the problems of the poor..KTR

TG Budget : రాష్ట్ర బడ్జెట్‌ పేదల కష్టాలను తీర్చేలా లేదు : కేటీఆర్‌

TG Budget: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ బడ్జెట్‌ పై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. ఈ బడ్జెట్‌ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేక మేడలా కూల్చిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పేదల కష్టాలను తీర్చేలా లేదని మండిపడ్డారు.

420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా లేవు

ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపేందుకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రుణమాఫీ జరిగిందో లేదో కాంగ్రెస్ వాళ్లకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అంకెలు ఎందుకు మారాయో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. పదేళ్ల ప్రగతి రథ చక్రానికి పంక్చర్ చేశారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను మోసం చేసేలా ఈ బ‌డ్జెట్ ఉంద‌ని మండిప‌డ్డారు.

ఆరు గ్యారెంటీల ఊసే లేదు

ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీతో పాటు ఆరు గ్యారెంటీల ఊసే లేద‌ని కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ఈ రోజు రాష్ట్రంలోని పేద‌లు, రైతులు, ఆడ‌బిడ్డ‌లు అంద‌రూ కూడా ఆశ‌గా ఎదురు చూశారు. కానీ ఒక్క మాట‌లో చెప్పాలంటే భ‌ట్టి విక్ర‌మార్క సుదీర్ఘ ఉప‌న్యాసం విన్న త‌ర్వాత మాకు అర్థ‌మైందంటే ఆరు గ్యారెంటీలు గోవిందా గోవిందా అని అర్థ‌మైంది. ఆరు గ్యారెంటీల‌కు తిలోద‌కాలు వేశారు, పాత‌రేశార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. ఇది కాంగ్రెస్‌కు రెండో బ‌డ్జెట్‌. ఈ బ‌డ్జెట్‌ను చూసిన త‌ర్వాత మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

Related Posts
ట్రూడో రాజీనామాకు డెడ్‌లైన్‌..సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌
Deadline for Trudeau resign

ఒట్టావా : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పై సొంతపార్టీ భగ్గుమంది. ఆయన రాజీనామా చేయాలని 24 మంది లిబరల్‌ ఎంపీలు డిమాండ్‌ చేశారు. అక్టోబరు 28లోపు Read more

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే
Former MLA Koneru Konappa said goodbye to Congress

స్వతంత్రంగా ఉంటానని ప్రకటించిన కోనేరు కోనప్ప హైదరాబాద్‌: బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప.. కొన్ని నెలలకే ఆ పార్టీకి గుడ్ Read more

MMTS: ఎంఎంటీస్ అత్యాచార ఘటన.. నిందితుడి గుర్తింపు
MMTs rape incident.. accused identified

MMTS : హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన Read more

రాహుల్ పై సభాహక్కుల ఉల్లంఘన
rahul gandhi

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్నీ ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్రపతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *