The details of the deceased

తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలు

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

ఈ దుర్ఘటనలో నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఈ తొక్కిసలాటలో మరో 40 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భక్తుల అధిక సంఖ్య, నిర్వాహకుల వైఫల్యం, సరైన భద్రతా చర్యల లేకపోవడం వంటి అంశాలు ప్రాథమికంగా వెల్లడయ్యాయి.

Related Posts
IRCTC సేవల్లో అంతరాయం..
IRCT Major Outage Hits Indian Railways

భారతీయ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ రోజు గణనీయమైన అవుటేజ్‌లను ఎదుర్కొంది. దీని ఫలితంగా, ప్రయాణికులు రైలు టికెట్లను బుక్ చేయడానికి వెబ్‌సైట్ Read more

అమెరికా ఎన్నికలు..కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్‌
US elections.First transgender for Congress

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా సాగిపోతున్నారు. మరికాసేపట్లో స్పష్టమైన ఫలితాలతో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియనుంది. ఈ Read more

గాజా యుద్ధం: పునఃప్రారంభంపై కీలక హెచ్చరిక
గాజా యుద్ధం పునఃప్రారంభంపై కీలక హెచ్చరిక

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శనివారం ఒక కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, “అవసరమైతే గాజాలో యుద్ధాన్ని పునఃప్రారంభించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది” అని Read more

లక్షకు పైగా చెట్లను నరికివేయడం!
లక్షకు పైగా చెట్లను నరికివేయడం!

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఎటిఆర్) కోర్ ప్రాంతం నుండి బచారం రిజర్వ్ అటవీ భూములకు నాలుగు గ్రామాలను మార్చడం ఇప్పుడు అటవీ అధికారులకు పర్యావరణ సవాలుగా ఉంది, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *