The details of the deceased

తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలు

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

ఈ దుర్ఘటనలో నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఈ తొక్కిసలాటలో మరో 40 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భక్తుల అధిక సంఖ్య, నిర్వాహకుల వైఫల్యం, సరైన భద్రతా చర్యల లేకపోవడం వంటి అంశాలు ప్రాథమికంగా వెల్లడయ్యాయి.

Related Posts
అదానీ గొప్ప మనసు.. దివ్యాంగుల వివాహానికి రూ.10 లక్షలు
jeet adani

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ – దివా వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శుభకార్యంలో "మంగళ సేవ" అనే ప్రత్యేక Read more

కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు
High Court verdict on KTR quash petition today

హైదరాబాద్‌: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు..ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ ను Read more

విశాఖ పోర్టు రికార్డ్
vizag port

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పోర్టు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రవాణా రంగంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి మొత్తం Read more

టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి అన్ని అనుమతులు: కవిత
All permissions to AP due to TDP BJP alliance.. Kavitha

అభివృద్ధిలో వీరు చేసిందేమీ లేదని విమర్శ హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా Read more