The details of the deceased

తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలు

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

Advertisements

ఈ దుర్ఘటనలో నర్సీపట్నానికి చెందిన నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. ఈ తొక్కిసలాటలో మరో 40 మంది భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పర్యవేక్షించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భక్తుల అధిక సంఖ్య, నిర్వాహకుల వైఫల్యం, సరైన భద్రతా చర్యల లేకపోవడం వంటి అంశాలు ప్రాథమికంగా వెల్లడయ్యాయి.

Related Posts
ఏపీకి ప్రధాని మోదీ వరాలు
narendra modi

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర అబివృద్దికి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వరాలు కురిపించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతల Read more

ఫ్రాన్స్ చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వం పతనమైంది.
french government

ఫ్రాన్స్‌లో చరిత్రలో తొలిసారి, ప్రాధానమంత్రి మిషెల్ బార్నియర్ ప్రభుత్వం మూడు నెలల తర్వాత పతనమైంది. బుధవారం, ఫ్రెంచ్ చట్టసభలో అవిశ్వాస తీర్మానం ఓడించి, ప్రస్తుత ప్రభుత్వాన్ని అవమానించారు. Read more

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై హీరో విజయ్ కీలక నిర్ణయం
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై హీరో విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న ప్రముఖ సినీ నటుడు తలపతి విజయ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టం – 2025 పై Read more

పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు
పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

ఆంధ్రప్రదేశ్ లో ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు టార్గెట్ చేస్తూ ముఠాలు చోరీలకు Read more

×