తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సు, ప్రదర్శన ప్రారంభంలో సీఎం చంద్రబాబు
తిరుపతి: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నాం. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ హిందువులు అధికంగా ఉన్న విశ్వనగరాల్లో శ్రీవారికి మందిరాలు కడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో సోమవారం చంద్రబాబు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.ప్రతిరాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం.

సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు కీలకం
మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, అభివృద్ధికి సూచికలు. ఆర్థిక వ్యవస్థలో ఆలయ పర్యాటకానికి ప్రత్యేక పాత్ర. దేశంలో ఆలయాల ఎకానమీ విలువ రూ.6 లక్షల కోట్లు ఉంటుంది. ఆధ్యాత్మిక సంపద పరిరక్షణలో ఏఐ ఇంటిగ్రేషన్, ఫిన్‌టెక్ సొల్యూషన్స్, విరాళాల వినియోగం, సుస్థిరత, భద్రత, రద్దీ నియంత్రణ, ఆర్థిక పారదర్శకత వంటి అంశాలపై ఈ సదస్సు చర్చిస్తుంది. ఆలయాల నిధుల నిర్వహణ, చట్టపరమైన సవాళ్లకు పరిష్కార మార్గాలను చూపుతుంది. ఆలయాల్లో ఏఐ సాంకేతికత ఇంకా పెరగాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు.ప్రతిరాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం.
చిన్న ఆలోచనతో అన్నదానానికి శ్రీకారం
చిన్న ఆలోచనలు ఎంతో మేలు చేస్తాయనడానికి టీటీడీ అన్నదాన ట్రస్టు ఓ ఉదాహరణ. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1983-84లో తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు అన్నదాన ట్రస్టుకు రూ.2 వేల కోట్ల మూలనిధి ఉంది. నేను 2003లో ప్రారంభించిన ప్రాణదానం ట్రస్టు మూలనిధి రూ.440 కోట్లకు చేరింది. వేంకటేశ్వరస్వామి మహిమగల దేవుడు. తిరుమలలో ఎవరైనా తప్పుచేస్తే, వారిని ఈ జన్మలోనే శిక్షిస్తాడని చిన్నప్పటి నుంచి నమ్ముతున్నాను. అందుకే ఎవరినీ ఇక్కడ తప్పు చేయనివ్వం అని చంద్రబాబు స్పష్టంచేశారు
ప్రతిరాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం – ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
తిరుమల ప్రాంతంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు తిరుమలనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఆలయాలకు కూడా ఆదర్శంగా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయాల ద్వారా ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధి మాత్రమే కాకుండా, ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పర్యాటక వాణిజ్యాన్ని పెంచడం, భద్రతా అంశాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఆధ్యాత్మిక సంపదను ప్రదర్శించడం వంటి లక్ష్యాలను కాంక్షించారు.