Srivari Arjitha Seva Tickets released for the month of April

ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకోసం ముఖ్య గమనిక… 2025 ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఏప్రిల్ కోటాను జనవరి 18 నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది. జనవరి 18 ఉదయం నుంచి 20 వ తేదీ వరకూ రెండు రోజుల పాటూ ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నవారంతా జనవరి 20 నుంచి 22 మధ్యాహ్నం లోగా డబ్బులు చెల్లించాలి. లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తుంది టీటీడీ.

image
Srivari Arjitha Seva Tickets released for the month of April

.21 వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు
.21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
.23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం టిక్కెట్లు
.23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు
.23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు – వికలాంగుల దర్శన టికెట్లు
.24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
.24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా
.27వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవా కోటా విడుదల టిక్కెట్లు విడుదలవుతాయి
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ నుంచి ఆర్జిత‌సేవ‌లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు.

Related Posts
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య..
Another Telugu student commits suicide in America

వాషింగ్టన్‌ : మరో తెలుగు విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు Read more

నేడు ఏపిలో ‘పల్లె పండుగ’ కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను Read more

హైదరాబాద్‌ జూపార్క్‌లో భారీగా పెరిగిన ధరలు
hyderabad zoo park

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లో ప్రవేశ రుసుములను మరియు వివిధ సేవల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ Read more

దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు
దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో మరియు హైదరాబాద్ లోని ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సమాచారం ప్రకారం, ఆయన సోదరుడు, Read more