Srinivas Gowda as Chief Adviser of Goa State OBC

శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. గోవాలోని హోటల్ గోల్డెన్ ప్లాటియూ లో రాష్ట్రీయ ఓబిసి మహాసంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఓబిసి మహసంఘ్ – గోవా, చీఫ్ అడ్వైజర్గావి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. దీంతో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో అరుదైన గౌరవం దక్కింది.

image
image

తెలంగాణలో మాదిరిగా గోవాలో కూ డా ఓబీసీల సంక్షేమ పథకాల అమలు కు కృషి చేయాలని వివిధ సంఘాలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. అనంతరం శ్రీ నివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్ర భుత్వం జనగణనతోపాటు కులగణన చేసి, జనాభా ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్‌ చేశా రు. తెలంగాణ తరహా గోవాలో మహాత్మా జ్యోతిబాఫూలే రెసిడెన్షియల్‌ సూళ్లు, కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీ య ఓబీసీ మహాసంఘ్‌ గోవా రాష్ట్ర అ ధ్యక్షుడు మధు అనంత్‌నాయక్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నోను నాయక్‌, ఫిషరీస్‌ కమ్యూనిటీ రాష్ట్ర అధ్యక్షుడు పద్మనాభ అమోడర్‌, నాభిక్‌ సమాజ్‌ సెక్రటరీ లాడ్‌సులాకర్‌ పాల్గొన్నారు.

Related Posts
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
Police restrictions on New Year celebrations

హైదరాబాద్‌: న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పడానికి ఇప్పటి నుంచే హైదరాబాద్ ముస్తాబవుతోంది. వేడుకల కోసం సిద్ధమౌతోంది. ఇప్పటికే ఈ దిశగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ఆఫర్లను Read more

సామ్‌సంగ్ షేర్లు 4 సంవత్సరాల కనిష్టానికి చేరాయి
samsung india gst investigation

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఈ సంవత్సరం 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ఈ సంవత్సరం టీఎస్‌ఎమ్‌సీ (TSMC) మరియు ఎన్విడియా Read more

నేడు హస్తినకు సీఎం రేవంత్‌ రెడ్డి పయనం
CM Revanth Reddy is going to Hastina today

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్‌ ఖరారు అయినట్టు సమాచారం. గత నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి Read more

మౌలిక వసతుల కోసం మెడికోస్ ధర్నా
medical college F

ఆసిఫాబాద్ కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, మౌలిక వసతుల కోసం మెడికోస్ ధర్నా నిర్వహిస్తూ ఆసిఫాబాద్‌లోని మెడికల్ కళాశాలలో కనీస Read more