జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో క్యాబిన్ లగేజీ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విమానాశ్రయ భద్రతా వ్యవస్థ, ప్రయాణికుల క్రమశిక్షణపై చర్చకు దారితీస్తోంది.వివరాల్లోకి వెళితే, శ్రీనగర్ విమానాశ్రయం లోని ఒక ఎయిర్‌లైన్స్ విమానానికి బోర్డింగ్ ప్రక్రియ (Boarding process) జరుగుతుండగా, ఆర్మీ అధికారి క్యాబిన్‌లో పరిమితికి మించిన లగేజీని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయ నియమావళి ప్రకారం నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే క్యాబిన్ లగేజీ అనుమతించబడుతుంది. ఆర్మీ అధికారి వద్ద ఉన్న లగేజీ బరువు, పరిమాణం రెండూ అనుమతించిన పరిమితిని మించడంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అదనపు ఛార్జీలు చెల్లించాలని కోరారు.
పూర్తి వివరాలు
దీంతో సిబ్బందిపై దాడిచేసి ముష్ఠిఘాతాలు కురిపించారు. ఈ తతంగం మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడిలో నలుగురు ఎయిర్‌లైన్స్ సిబ్బందికి గాయాలయ్యాయి.శ్రీనగర్ (Srinagar) నుంచి న్యూఢిల్లీకి వెళ్లే స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆర్మీ అధికారి టిక్కెట్ బుక్ చేసుకున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేందుకు వచ్చిన ఆయన 16 కిలోల హ్యాండ్ బ్యాగేజీ (క్యాబిన్ లగేజ్) తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం, క్యాబినెట్ లగేజి పరిమితి 7 కిలోలు. దీనికి రెండింతలు ఎక్కువే ఆయన తీసుకురావడం సమస్య ఉత్పన్నమైంది. లగేజీకి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బోర్డింగ్ సమయంలో సిబ్బంది చెప్పినా ఆయన నిరాకరించారు.
పదేపదే దాడులు
అంతేకాదు, బోర్డింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండా బలవంతంగా ఎయిరో బ్రిడ్జ్‌లోకి ప్రవేశించారు. ఈ సమయంలో సిబ్బంది అడ్డుకోవడంతో రెచ్చిపోయారు. చెక్-ఇన్ గేట్ వద్ద ఉపయోగించే సైన్‌బోర్డుతో ఉద్యోగులపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించినా, ఆర్మీ అధికారి మాత్రం ఆగలేదు. సిబ్బందిని దూషిస్తూ పదేపదే దాడులు చేశారు. ఈ ఘటనలో ఒకరికి వెన్నెముకకు గాయం కాగా, ముగ్గురికి ముఖం, దవడపై గాయాలయ్యాయి. ఓ ఉద్యోగి అపస్మారక స్థితిలో కింద పడిపోయినా ఆర్మీ అధికారి వదిలిపెట్టలేదు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, గతంలోనూ విమాన సిబ్బందిపై పోలీసులు, ఆర్మీ అధికారులు దాడిచేసిన దాఖలాలు ఉన్నాయి.
తక్షణమే స్పందించి
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పైస్‌జెట్, ఆర్మీ అధికారిని నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చే ప్రక్రియ ప్రారంభించింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ‘తమ ఉద్యోగులపై హింసను స్పైస్‌జెట్ తీవ్రంగా ఖండిస్తోంది. చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటుంది’ అని సంస్థ ప్రకటనలో తెలిపింది. అటు, CISF కూడా స్పందిస్తూ, తమ సిబ్బంది తక్షణమే స్పందించి జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారని, విమాన సర్వీసులు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే, ఆర్మీ వర్గాలు కూడా ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించినట్టు తెలిపాయి. విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
శ్రీనగర్ విమానాశ్రయం చరిత్ర ఏమిటి?
శ్రీనగర్ విమానాశ్రయం, అధికారికంగా షేక్ ఉల్-ఆలమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవబడుతుంది.ఇది జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
భారతదేశంలోనే పురాతన విమానాశ్రయం ఏది?
భారతదేశంలో మొదటి విమానాశ్రయం బొంబాయిలో (ప్రస్తుతం ముంబై) స్థాపించబడింది. దీనిని జూహూ ఏరోడ్రోమ్ అని పిలుస్తారు. ఇది 1928లో స్థాపించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: