Srikakulam youth trapped in Saudi Arabia

సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు..

సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు..

శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు చెందిన యువకులు. కంబస్ పరిశ్రమలో ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్షా 20వేలు తీసుకుని 16 మందిని ఏజెంట్లు సౌదీకి పంపారు. సౌదీలో 2 నెలలుగా కష్టపడి పనిచేసినా యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి తిండి, తాగునీరు లేక సౌదీలో యువకులు అవస్థలు పడుతున్నారు. ఏజెంట్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో తమ కష్టాలను వివరిస్తూ బాధితులు కుటుంబ సభ్యులకు వీడియో పంపారు.

విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన వలస కూలీలకు అండగా ఉంటానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. వీడియో కాల్ ద్వారా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధితులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

Related Posts
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌
Former MLA Vallabhaneni Vamsi arrested

కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టు కేసు నమోదు.. అమరావతి: వైసీపీ కీలక నేత , గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో Read more

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి, భారత్‌ ఖండన
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి భారత్‌ ఖండన

అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్‌లో ఉన్న బీఏపీఎస్‌ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్‌ అధికారిక Read more

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు – మంత్రి కొలుసు
kolusu parthasarathy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, మే, జూన్ Read more

రాష్ట్ర రైతులకు మార్చి 31లోపు ‘రైతు భరోసా’ – డిప్యూటీ సీఎం భట్టి
bhatti budjet

రాష్ట్రంలోని అన్ని జిల్లాల రైతులకు మార్చి 31లోపు ‘రైతు భరోసా’ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. వనపర్తిలో Read more