కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి హెచ్డి కుమార స్వామికి విజప్తి చేసిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ : తెలంగాణాలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ మంత్రి హెచి కుమార స్వామికి (Kumara Swamy) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) విజప్తి చేశారు. రాష్ట్రంలోని సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ), స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఐఎల్) పునరుద్ధరణకు కేంద్ర మంత్రి హెచ్ డి కుమార స్వామి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) పాల్గొన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సిసిఐ, ఎస్ఐఐఎల్ పై కేంద్రమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన రంగాలను బలోపేతం చేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, రామగుండం ఫెర్టిలై జర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (Fertilizers and Chemicals Limited) పునరుద్ధరణకు నోచుకున్నట్లుగానే సిసిఐ, ఎస్ఐఐఎల్ల పునరుద్ధ రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.

సిసిఐ, ఎస్ఐఐఎల్ పునరుద్ధరణపై కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ), స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఐఎల్) పునరుద్ధరణ అవసరాన్ని, ప్రాధాన్యతను మంత్రి శ్రీధర్ బాబు కేంద్రమంత్రికి తెలిపారు. గతంలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పునరుద్ధరణను రూ.5000 కోట్లతో చేపట్టిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ), స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఐఐఎల్) మూత పడడానికి దారితీసిన పరిస్థితులను, ఈ పరిశ్రమల పునరుద్ధరణతో యువతకు ఉపాధి అవకాశాల మెరుగుద మెరుగుదల, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను మంత్రి శ్రీధర్ బాబు కేంద్రమంత్రికి వివరించారు. వెనుకబడిన, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పరిశ్రమల పునరుద్ధరణతో ప్రాంతీయాభివృద్ధిలో సమతుల్యత సాధ్యమై రాష్ట్రం, దేశం ప్రగతిబాటలో పయనిస్తాయని కేంద్రమంత్రికి వివరించారు.
పరిశ్రమల పునరుద్ధరణకు కృషి చేస్తోన్న శ్రీధర్ బాబు
ఆర్థిక, సామాజిక పురోగతికి దన్నుగా నిలిచే ఈ పరిశ్రమలను పునరుద్ధరించాల్సిందిగా కోరారు. సమగ్ర వివరాలతో కూడిన లేఖను మంత్రి శ్రీధర్ బాబు కేంద్రమంత్రికి అందించారు. ఈ నెలాఖరులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, తెలంగాణలో నెలకొని వున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పనితీరుతో పాటు, సంబంధిత పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపట్టే దిశగా సమీక్షను నిర్వహిస్తానని కేంద్రమంత్రి మంత్రి శ్రీధర్ బాబుకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు.
శ్రీధర్ బాబు అర్హత ఏమిటి?
ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎల్.ఎల్.బి., హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ పట్టా పొందారు.
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం తెలంగాణలో ఏఏ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు?
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యమంత్రిగా శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు 7 డిసెంబర్ 2023న తెలంగాణ వైజ్ఞానిక, పరిశ్రమల శాఖ మంత్రి పదవిని స్వీకరించారు.
ఆయన ప్రస్తుతం సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, పరిశ్రమలు & కార్మిక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com