హైదరాబాద్: ఇ-గవర్నెన్స్, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబ్బురపరుస్తోందని ఆయన ప్రశంసించారు.

ప్రజా సేవలు తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్ అవసరం
ఎస్తోనియా (Estonia) రాయబారి మ్యారియే లూప్ ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రిని కలిసారు. ఈ సందర్భంగా ఎస్తోనియా వాణిజ్య ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజి, కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఆరోగ్యరంగాల ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని, వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించాలని శ్రీధర్ బాబు (Sridhar Babu) కోరారు. వాణిజ్యం, ఏఐ సాంకేతికతలో కూడా కలిసి పనిచేయాలన్ని ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ప్రజా సేవల విభాగాలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఇ-గవర్నెన్స్ (E-Governance) కీలకమని ఆయన తెలిపారు. ఇందులో ఎస్తోనియా తోడ్పాటును కోరుతున్నాం. సైబర్ సెక్యూరిటీలో సైతం పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
డ్రోన్ టెక్నాలజిలో తెలంగాణాలో గణనీయ అభివృద్ధి సాధించిందని, ఇటీవల పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో హైదరాబాద్లో తయారైన డ్రోన్లు మా శత్రుదేశానికి భారీ నష్టం కలిగించాయన్నారు. భవిష్యత్తు యుద్ధాలు డ్రోన్లు, సైబర్ దాడులతోనే జరుగుతాయి. ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండెడ్ మద్యం ఉత్పత్తిలో ముందున్నాం అన్నారు. ఈ రంగాల్లో కూడా కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. సెప్టెంబరులో తమ దేశం సందర్షించాలని ఎస్తోనియా రాయబారి మ్యారియే లూప్ చేసిన అభ్యర్థనకు శ్రీధర్ బాబు స్పందించారు. తమ అధికారుల బృందం వస్తుందని, విద్య, ఇ గవర్నెన్స్, ఏఐ, రోబోటిక్స్లో పరస్పరం సహకరించుకునే విషయంపై చర్చిస్తారని తెలిపారు. సమావేశంలో ఐటి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీ సేవ) కార్పోరేషన్ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు .
ఎస్తోనియా దేశం ఏమిటి? ఇది డిజిటల్ పాలనలో ఎందుకు ప్రాముఖ్యం పొందింది?
ఎస్తోనియా ఉత్తర యూరోపులోని ఒక చిన్న దేశం. ఇది ప్రపంచంలోని అత్యధిక డిజిటలైజ్డ్ ప్రభుత్వ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలలో ఒకటి. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ‘ఇ-ఎస్టోనియా’ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
తెలంగాణ రాష్ట్రం ఎస్తోనియాతో కలిసి పనిచేయాలనుకుంటున్న రంగాలు ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థలు, డేటా సెక్యూరిటీ, పబ్లిక్ సర్వీసుల డిజిటలైజేషన్ వంటి రంగాల్లో ఎస్తోనియాతో సాంకేతిక సహకారం తీసుకోవాలనుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Governor Jishnu Deva Varma: నర్సులే సమాజానికి ప్రాణదాతలు– గవర్నర్ జిష్ణుదేవవర్మ