భారత మాజీ క్రికెటర్, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన రిటైర్మెంట్‌కు సంబంధించి సంచలన విషయాలను తాజాగా బయటపెట్టాడు. 2019 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలకడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించాడు. ఆటలో తనకు తగిన గౌరవం, మద్దతు లభించకపోవడమే ఆ కఠిన నిర్ణయానికి కారణమని స్పష్టం చేశాడు. అప్పటికే క్రికెట్‌ను ఆస్వాదించడం మానేశానని చెప్పిన యువీ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: IND Vs NZ: సంజూ శాంసన్ పై సునీల్ గవాస్కర్ అసహనం
నా ఆటను ఏమాత్రం ఆస్వాదించలేకపోయా
ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో జరిగిన ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో యువీ ఈ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. “నేను నా ఆటను ఏమాత్రం ఆస్వాదించలేకపోయాను. నాకు మద్దతుగానీ, గౌరవంగానీ లభిస్తున్నట్లు అనిపించలేదు. ఇవేవీ లేనప్పుడు నేనెందుకు ఆడాలి? ఆస్వాదించలేని దాని కోసం ఎందుకు వేలాడాలి? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఆ ఒత్తిడి నన్ను మానసికంగా గాయపరిచింది. ఎప్పుడైతే నేను ఆడటం ఆపేశానో, అప్పుడే మళ్లీ నేను నాలా మారాను.

ప్రశాంతంగా అనిపించింది” అని యువరాజ్ (Yuvraj Singh) చెప్పుకొచ్చాడు.ఇదే సంభాషణలో తన చిన్ననాటి అనుభవాన్ని కూడా యువీ పంచుకున్నాడు. 13-14 ఏళ్ల వయసులో తన ప్రతిభను ఒకరు తక్కువ చేసి మాట్లాడారని గుర్తుచేసుకున్నాడు. “ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, నా ఆటను పూర్తిగా గమనించే సమయం ఆయనకు లేకపోయి ఉండొచ్చనిపిస్తుంది. మా నాన్నకు మర్యాద ఇవ్వడం కోసం ఏదో చెప్పి ఉంటారు. అప్పుడు మా నాన్న ఆ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు. కానీ నేను అలా తీసుకోలేదు” అని యువీ తన పరిణతిని చాటుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: