మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (WWC) లో భారత మహిళా జట్టు చరిత్రాత్మకంగా ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో శక్తివంతమైన ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఫైనల్ బెర్త్ ఖరారు చేసింది. నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్‌లో భారత్ ట్రోఫీ కోసం పోటీ పడనుంది.
Read Also: Women’s World Cup 2025: జీసస్ వల్లే ఈ విజయం: జెమీమా
1973లో ప్రారంభమైన మహిళల వన్డే ప్రపంచకప్ (WWC) ఇప్పటివరకు 12 సార్లు నిర్వహించబడింది. కానీ ఈ వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం మూడు జట్లే విజేతలుగా నిలిచాయి — ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.

ఫైనల్‌కి చేరినా విజేతగా నిలవలేకపోయింది
భారత్ ఇప్పటివరకు రెండు సార్లు (2005, 2017) ఫైనల్‌కి చేరినా విజేతగా నిలవలేకపోయింది. అయితే ఈసారి జట్టు ఆత్మవిశ్వాసం, ప్రదర్శన చూస్తే చరిత్రను తిరగరాయడం ఖాయం అనిపిస్తోంది. గెలిస్తే,ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.
1973: ఇంగ్లండ్, 1978: ఆస్ట్రేలియా, 1982: ఆస్ట్రేలియా, 1988: ఆస్ట్రేలియా, 1993: ఇంగ్లండ్, 1997: ఆస్ట్రేలియా, 2000: న్యూజిలాండ్, 2005: ఆస్ట్రేలియా, 2009: ఇంగ్లండ్, 2013: ఆస్ట్రేలియా, 2017: ఇంగ్లండ్, 2022: ఆస్ట్రేలియా.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: