world Test Championship వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సారి తుది పోరు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గత సీజన్‌లో టైటిల్ గెలుచుకున్న ఆస్ట్రేలియా మరోసారి కప్‌ను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని ఎగరేసే ప్రయత్నాల్లో ఉంది.ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ముందస్తు సన్నాహాలపై దృష్టి పెట్టింది. ఫైనల్‌కు ముందు జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది.
world Test Championship : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
ఈ మ్యాచ్ ఈ నెలాఖరులో జరగనుంది. అంతేకాదు, జూన్ 3న కూడా మరో ప్రాక్టీస్ మ్యాచ్ ప్రొటీస్ జట్టు ఆడనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు సభ్యులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొంటున్నారు. గ్రూప్ స్టేజి ముగిసిన తర్వాత కొంతమంది ఆటగాళ్లు నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. మిగిలిన వారు మే 25న ఐపీఎల్ పూర్తయ్యాక జట్టుతో చేరతారు.ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడపై ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) విధించిన తాత్కాలిక నిషేధాన్ని తొలగించింది. తొలుత రబాడ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమవుతాడన్న వార్తలు వచ్చినప్పటికీ, నిషేధం ఎత్తివేతతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఊరట లభించింది. ఇప్పుడు అతడు ఫైనల్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
Read More : IPL 2025 : యువ ఆటగాళ్ల సెంచరీలు చేతిచెదిరాయి