हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Women’s World Cup 2025: జీసస్ వల్లే ఈ విజయం: జెమీమా

Anusha
Latest News: Women’s World Cup 2025: జీసస్ వల్లే ఈ విజయం: జెమీమా

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s World Cup 2025) సెమీఫైనల్‌లో టీమిండియా మహిళా జట్టు ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుపై ఐదు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.

ఈ విజయానికి ప్రధాన కారణం బ్యాటర్ జెమీమా (Jemima Rodrigues) రోడ్రిగ్స్ అద్భుత ప్రదర్శనే. 134 బంతుల్లో 14 ఫోర్లతో అజేయంగా 127 పరుగులు చేసి, ఆమె టీమిండియాను విజయలక్ష్యానికి చేర్చింది. ఈ విజయానంతరం జెమీమా కన్నీటి పర్యంతమై జీసస్ (Jesus) కి కృతజ్ఞతలు తెలిపింది.

Read Also: Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్

జెమీమా (Jemima) మాట్లాడుతూ, “ఈ విజయానికి కారణం జీసస్ మాత్రమే. ఆయనే నన్ను నడిపించారు. నేను ఆఖరి వరకు నిలబడగలిగిందంటే ఆయన కృప వల్లే. ప్రతి క్షణం ఆయన స్ఫూర్తితోనే బ్యాటింగ్ చేశాను,” అని తెలిపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె చేతులు జోడించి ఆకాశం వైపు చూసి కృతజ్ఞతలు తెలిపిన దృశ్యం క్రీడాభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.

ఈ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్(134 బంతుల్లో 14 ఫోర్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి వరకు క్రీజులో నిలబడి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది.

ఆయన వల్లే నేను ఈ ఇన్నింగ్స్ ఆడాను

జెమీమా అసాధారణ ప్రదర్శనతో టీమిండియా 339 పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది.ఈ అద్భుత శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జెమీమా.. హోస్ట్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది.

ఏడుస్తూనే తన ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చింది. ‘ముందుగా నేను జీసస్‌కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ ఇన్నింగ్స్ ఆడాను. ఈ రోజు జీసస్ నన్ను నడిపించాడు. నాకు అండగా నిలిచిన మా అమ్మ, నాన్న, కోచ్‌తో పాటు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.

Women’s World Cup 2025

ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని

గత నెల నాకు చాలా కష్టంగా గడిచింది. కానీ ఈ ఇన్నింగ్స్ నాకు ఒక కలలా అనిపిస్తుంది. ఈ విజయం ఇంకా నా మదిలోకి ఎక్కలేదు.నేను స్నానం చేయడానికి వెళ్తుండగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని అనుకున్నాను. నా కోసం కాకుండా జట్టు కోసమే ఆడాను.

గతంలో మేం కీలకమైన మ్యాచ్‌లు ఓడిపోయాం. ఈ సారి ఆ తప్పిదం చేయకూడదని గట్టిగా అనుకున్నాను. హాఫ్ సెంచరీ, సెంచరీ ఏదీ నేను పట్టించుకోలేదు. జట్టు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే సెంచరీని సెలెబ్రేట్ చేసుకోలేదు.గతేడాది ప్రపంచకప్ జట్టులో నాకు చోటు దక్కలేదు.

ఫామ్‌లో ఉన్నా నాకు అవకాశం దక్కలేదు

అప్పుడు ఫామ్‌లో ఉన్నా నాకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలో నేను తీవ్ర మానసిక వేధనను అనుభవించాను. ప్రతీ రోజు ఏడుస్తూ కూర్చున్నాను. మరింత ఎక్కువగా కష్టపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాను. నేటి ఇన్నింగ్స్‌లో ఆ దేవుడు నాకు అండగా నిలిచాడు. బ్యాటింగ్ చేసే సమయంలో నాతో నేను ఎక్కువగా మాట్లాడుకున్నాను.

బైబిల్‌లో ఒక వ్యాక్యాన్ని పదే పదే ఉటంకించాను.’నిశ్చలంగా ఉండు.. ఆ దేవుడు నీ కోసం పోరాడుతాడు.’అనే బైబిల్ (Bible) వ్యాఖ్యాన్ని పదే పదే మనసులో అనుకున్నాను. అందులో ఉన్నట్లుగానే ఆ దేవుడు నా కోసం పోరాడాడు. ఈ విజయం ఇచ్చిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను.

నా సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు

హర్మన్‌ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) వచ్చినప్పుడు మంచి భాగస్వామ్యం నమోదు చేయాలని భావించాం.చివర్లో నేను దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాను. కానీ అది నా వల్ల కాలేదు.దీప్తి శర్మ ప్రతీ బంతికి నాతో మాట్లాడి నన్ను కూల్ చేసింది.

నా సహచర ఆటగాళ్లు నాకు అండగా నిలిచారు. ఈ గెలుపు క్రెడిట్ నా ఒక్కదానిదే కాదు. సమష్టిగానే ఈ విజయం దక్కింది. ప్రేక్షకుల మద్దతు, వారి అరుపులు నన్ను మరింత ఉత్సాహపరిచాయి.’అని జెమీమా చెప్పుకొచ్చింది. జెమీమా చెప్పినట్లుగా ఆమెకు దేవుడు అండగా నిలిచాడు. ఆమె ఇచ్చిన మూడు సునాయస క్యాచ్‌లను ఆసీస్ ఆటగాళ్లు వదిలేసారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870