ఆసీస్ చేతిలో భారత్ పరాజయం
విశాఖపట్నంలో(Visakhapatnam) జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్(Women’s World Cup 2025) మ్యాచ్‌లో టీమ్ ఇండియా వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ కీలకపాత్ర పోషించింది.
Read also: Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం

అలీసా హీలీ అద్భుత ఇన్నింగ్స్
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 331 పరుగులు చేసింది. అయితే, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
కెప్టెన్ అలీసా హీలీ 107 బంతుల్లో 142 పరుగులు (21 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెతో పాటు ఎలిస్ పెర్రి (47), ఆష్లె గార్డ్‌నర్ (45), లీచ్‌ఫీల్డ్ (40)* కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు.
భారత బౌలర్లు ఎంత శ్రమించినా ఆసీస్ జట్టును ఆపలేకపోయారు.
మ్యాచ్ ఎక్కడ జరిగింది?
ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది.
ఎవరు గెలిచారు?
ఆస్ట్రేలియా మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: