
క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా జట్టు అంటే కేవలం దూకుడు ఆటతీరు, అద్భుతమైన ప్రదర్శన మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన మానసిక వ్యూహం కూడా ఉంది. అదే స్లెడ్జింగ్ (Sledging). ఆస్ట్రేలియా జట్టు చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది.
ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను భగ్నం చేయడం, వారిని మానసికంగా దెబ్బతీయడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో ఆస్ట్రేలియన్లు ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఈ స్లెడ్జింగ్ అనే పద్ధతి వాడకం ఇప్పుడు వారి ఆటలో ఒక వ్యూహాత్మక అస్త్రంగా మారింది.
Read Also: Kareena Kapoor: నా కొడుకు ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడు: కరీనా కపూర్
ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో టీమిండియా ప్రదర్శించిన వైఖరి అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త వివాదానికి తెరతీసిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేయకూడదని తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ అంశాన్ని తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు కామెంట్స్ చేస్తున్న ఒక వీడియోను Kayo Sports అనే సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భారత జట్టు హ్యాండ్‌షేక్ నిరాకరణపై ఆటగాళ్లు ఎగతాళి
ఈ వీడియోలో భారత జట్టు హ్యాండ్‌షేక్ నిరాకరణపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళిగా మాట్లాడటం విశేషం. త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. వీడియోలో ఒక ఆసీస్ క్రికెటర్ మాట్లాడుతూ, “మనందరికీ తెలుసు, భారత జట్టు మా దేశానికి వస్తోంది.
అయితే మేము వారిలో ఒక కీలకమైన బలహీనతను గుర్తించాం” అని పేర్కొన్నారు. మరో క్రికెటర్ స్పందిస్తూ, “హ్యాండ్‌షేక్ (handshake) అంటే వారికి అంతగా ఇష్టం లేదని మాకు తెలుసు. కాబట్టి మేము ఒక బంతి వేయకముందే వారిని మానసికంగా ఆందోళనకు గురి చేయగలం” అని వ్యాఖ్యానించారు.
ఇలా, హ్యాండ్‌షేక్‌ను ఒక ‘బలహీనత’గా చిత్రించి, భారత ఆటగాళ్లను కలవడానికి తాము ఎలాంటి కొత్త తరహా ‘గ్రీటింగ్స్’ ప్రయత్నించవచ్చో సూచిస్తూ ఆసీస్ ప్లేయర్లు సరదాగా స్పందించారు. ఈ వీడియో భారత అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఏకాగ్రతను భంగం చేయడానికి ఆస్ట్రేలియా ఈ ‘మానసిక యుద్ధాన్ని’ మొదలుపెట్టిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: