हिन्दी | Epaper
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Rohit Sharma: వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపు పై హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే?

Aanusha
Latest News: Rohit Sharma: వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపు పై హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే?

భారత వన్డే క్రికెట్ జట్టులో సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన వన్డే జట్టులో బీసీసీఐ (BCCI) పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మ (Rohit Sharma) ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కి నాయకత్వ పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో, అభిమానుల్లో, మాజీ ఆటగాళ్లలో విస్తృత చర్చకు దారితీసింది.

Shubhman Gill: స్పిన్నర్ల వల్లే విజయం దక్కింది: గిల్

ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, రోహిత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం తనను షాక్‌కు గురిచేసిందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) వ్యాఖ్యానించాడు.ఇటీవలే భారత్‌కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మను కేవలం ఆటగాడిగా ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందని హర్భజన్ అన్నారు.

“శుభ్‌మన్ గిల్‌కు నా అభినందనలు. టెస్టుల్లో జట్టును బాగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు వన్డే బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ, రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటే బాగుండేది. 2027 ప్రపంచకప్ (2027 World Cup) ఇంకా చాలా దూరంలో ఉంది.

Rohit Sharma
Rohit Sharma

రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోయినా జట్టులో

ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో ఆరు, ఎనిమిది నెలలు ఆగాల్సింది” అని హర్భజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.రోహిత్ శర్మ కెప్టెన్ కాకపోయినా జట్టులో అతని పాత్ర మారదని హర్భజన్ స్పష్టం చేశారు. “వన్డేల్లో రోహిత్ యావరేజ్ 50కి దగ్గరగా ఉంది.

అతను ఎప్పటిలాగే తన దూకుడైన ఆటతీరును కొనసాగిస్తాడు. జట్టులో సీనియర్ గా ఉంటూ గిల్‌కు అవసరమైన సలహాలు ఇస్తాడు” అని భజ్జీ పేర్కొన్నాడు.శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer) ను వైస్ కెప్టెన్‌గా నియమించడంపై హర్భజన్ హర్షం వ్యక్తం చేశాడు. అతను ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అని, అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కుతోందని అన్నాడు.

గిల్, అయ్యర్ కలిసి జట్టును ఎలా ముందుకు నడిపిస్తారో

గిల్, అయ్యర్ కలిసి జట్టును ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా, మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) మాత్రం కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని సమర్థించాడు. ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న సరైన ముందడుగు అని పేర్కొన్నాడు.

“సెలక్టర్లు 2027 ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. 2026 చివరిలో కెప్టెన్ కోసం వెతకడం కంటే, ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయడం మంచిది. గతంలో ధోనీకి సచిన్, సెహ్వాగ్ వంటి సీనియర్లు అండగా నిలిచారు. కోహ్లీకి ధోనీ అనుభవం తోడైంది. ఇప్పుడు గిల్‌కు రోహిత్, విరాట్ కోహ్లీ మార్గనిర్దేశం చేస్తారు. ఇది జట్టు నిర్మాణంలో సరైన పద్ధతి” అని పార్థివ్ వివరించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870