భారత్ , దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడవ, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ల సమష్టి ప్రదర్శన తోడవ్వడంతో భారత్ దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్వేచ్ఛగా ఆడటంతోనే తాను మునపటిలా రాణించగలిగానని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తెలిపాడు.
Read Also: Temba Bavuma: ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ ఏమన్నారంటే?
ఇప్పటికీ జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.’ఈ సిరీస్‌లో నేను ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం నా మనసు చాలా తేలికగా ఉంది. గత 2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు.
నేను ఇలా ఆడితే జట్టుకు బాగా ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఈ ప్రదర్శన నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనైనా నేను రాణించగలను. జట్టుకు గెలుపు బాట వేయగలను. నా సొంత ప్రమాణాలను కొనసాగించడానికి, జట్టు విజయాల్లో భాగమయ్యేందుకు ప్రయత్నించాను. పరిస్థితులకు అనుగుణంగా నేను ఎక్కువసేపు బ్యాటింగ్ చేయగలను.

ఆస్ట్రేలియా తర్వాత నేను క్రికెట్ ఆడలేదు
15-16 ఏళ్ల నుంచి ఆడుతుంటే.. మీకు సందేహం కలిగే దశలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు భయాందోళనకు గురవుతారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఒక చిన్న పొరపాటు మీకు నష్టం కలిగించవచ్చు. ఇది ఒక ప్రయాణం, మెరుగుపడటం, మంచి వ్యక్తిగా మారడం ముఖ్యం. నా ప్రతికూల ఆలోచనలను నేను గుర్తించగలను.
వాటిని తెలుసుకొని, వాటిపై పనిచేయడం నా టెంపర్‌మెంట్‌ను మెరుగుపరుస్తుంది. ఇప్పటికీ జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను స్వేచ్ఛగా ఆడితే సిక్సర్లు కొట్టగలను. నా పరిమితులను ఛేదించి, బాగా ఆడాలని మాత్రమే కోరుకున్నాను.ఈ సిరీస్‌లో నా తొలి ఇన్నింగ్స్ అత్యుత్తమమైనది. ఆస్ట్రేలియా తర్వాత నేను క్రికెట్ ఆడలేదు.
జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం
ఆ రోజు లభించిన ఉత్సాహం రిస్క్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లు సాగిన తీరుకు నేను కృతజ్ఞుడను. కచ్చితంగా గెలవాలనే పరిస్థితులు మాలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీస్తాయి.
నేను ఒక మంచి ఆటగా ఆడాలని కోరుకుంటాను. ఇప్పటికీ రోహిత్, నేను జట్టు విజయాల్లో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దం సుదీర్ఘ కాలం నుంచి కలిసే ఆడుతున్నాం. జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం.’అని విరాట్ కోహ్లీ (Virat Kohli) చెప్పుకొచ్చాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: