ఇటీవల జరిగిన వేలంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman) ను రూ.9.20 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్.. బీసీసీఐ తాజా ఆదేశాల మేరకు అతన్ని వదులుకుంది. తనను జట్టు నుంచి తొలగించడంపై బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలిసారి స్పందించాడు. “జట్టు నుంచి పక్కన పెట్టినప్పుడు అంతకంటే చేసేదేముంటుంది?” అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు.
Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..
అత్యధిక ధరకు ఈసారి అమ్ముడుపోయాడు
మైదానం వెలుపల జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాల వల్ల ఒక స్టార్ ఆటగాడు సీజన్‌కు ముందే ఇంటికి వెళ్లాల్సి రావడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.నిజానికి ముస్తాఫిజుర్ (Mustafizur Rahman) తన కెరీర్ లోనే అత్యధిక ధరకు ఈసారి అమ్ముడుపోయాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఐపీఎల్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

కానీ, దౌత్యపరమైన చిక్కుల వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ముస్తాఫిజుర్ నిష్క్రమణతో కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, అతడి స్థానంలో మరో విదేశీ ఆటగాడిని ఎంచుకునేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: