మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కెరీర్‌పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. సిరాజ్‌కు ప్రపంచ కప్ జట్టులో స్థానం లభించకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్ కంటే జట్టు కూర్పుపైనే అధికంగా దృష్టి సారించినట్లుగా ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Read also: Shikhar Dhawan’s Wedding : ప్రేయసితో శిఖర్ ధావన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లేనా ?

సీమ్ బౌలర్లతో పాటు స్పిన్నర్లపై కూడా సెలక్టర్ల దృష్టి
సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడని, కానీ దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాలేకపోయాడని అన్నాడు.జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఎంపికయ్యారని, హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడని తెలిపాడు. అందుకే సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకున్నట్టు అర్థమవుతోందని చెప్పాడు. సీమ్ బౌలర్లతో పాటు స్పిన్నర్లపై కూడా సెలక్టర్లు దృష్టి సారించినట్లు చెప్పాడు. ఒకవేళ వారు సీమర్లతో పాటు వికెట్లు సాధిస్తే అది అదనపు ప్రయోజనమని అభిప్రాయపడ్డాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: