
భారతీయ స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయ్ ఛాను (Mirabhai Chanu) నార్వేలో జరుగుతున్న వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్షిప్‌లో 48 కేజీల వర్గంలో ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా ఆమె తన శక్తి, క్రమశిక్షణ,స్థిరమైన పట్టుదలతో ప్రేక్షకులను మెప్పించింది. మొత్తం 199 కేజీల బరువును ఎత్తి, ఆమె ప్రతి లిఫ్ట్‌లో కొత్త రికార్డులను సృష్టించింది.
Sana Mir: ఆజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పేది లేదన్న సనా మిర్
ఈ ఈవెంట్‌లో ఆమె మొత్తం 199 కేజీల బరువును ఎత్తింది. స్నాచ్ విభాగంలో 84 కేజీల బరువు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కేజీల బరువును ఆమె ఎత్తి రికార్డు సృష్టించింది. అయితే ఈ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకాన్ని కొరియా (Korea) కు చెందిన వెయిట్‌లిఫ్టర్ రీ సోంగ్ గుమ్ గెలుచుకున్నది.
ఆమె మొత్తం 213 కేజీల బరువును ఎత్తింది.మీరాభాయ్ ఛాను గతంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో (World Championship) స్వర్ణం గెలిచింది. 2017లో జరిగిన పోటీల్లో ఆమె గోల్డ్ మెడల్ (Gold Medal) కొట్టింది. అప్పుడు ఆమె 49 కేజీల డివిజన్‌లో పోటీపడింది. ఆ తర్వాత 2022లో 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్‌ను ఛాను గెలుచుకున్న విషయం తెలిసిందే.
తాజాగా జరిగిన ఈవెంట్‌లో స్నాచ్ విభాగం (Snatch section) లో ఛాను కొంత కష్టపడింది. 87 కేజీల వద్ద ఆమె రెండు సార్లు ఫెయిల్ అయ్యింది. కానీ క్లీన్ అండ్ జర్క్ విభాగంలో ఆమె తన రిథమ్‌ను అందుకున్నది. మూడు ప్రయత్నాల్లోనూ ఛాను సక్సెస్ అయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: