हिन्दी | Epaper
IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం

Latest News: Markrum: బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం : సౌతాఫ్రికా కెప్టెన్

Aanusha
Latest News: Markrum: బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిపోయాం : సౌతాఫ్రికా కెప్టెన్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మార్క్‌రమ్.. (Markrum) బ్యాటింగ్ వైఫల్యం తమ పతనాన్ని శాసించిందని చెప్పాడు. ‘మేం బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాం. ఈ మ్యాచ్‌ను మేం ప్రారంభించిన విధానం కూడా బాగుంది. మెరుగ్గా ఆరంభించడంపై మేం ఫోకస్ పెట్టాం.

Read Also: Hardik Pandya: నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా

ఆ లక్ష్యాన్ని కూడా అందుకున్నాం. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఓడినా మా ప్రదర్శన పట్ల గర్వపడవచ్చు. దురదృష్టవశాత్తు బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం.అయితే ఈ ఫార్మాట్ ఇలా జరగడం సర్వ సాధారణం. అయితే తొలి మ్యాచ్‌లోనే ఇలా జరగడం బాధాకరం. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్‌ను మరిచిపోయి తదుపరి మ్యాచ్‌కు సిద్దం కావాలి. రెండు రోజుల్లోనే మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ పిచ్ చాలా స్టిక్కీగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది.

Markrum: We lost due to batting failure: South Africa captain

మా వైపు మూమెంటమ్ తీసుకురాకపోవడం ఓటమిని శాసించాయి

టెన్నిస్ బాల్ బౌన్స్ కూడా ఉంది. 175 పరుగుల లక్ష్యాన్ని మేం ఛేదించాల్సింది. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తామని మేం అనుకున్నాం. ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి మరో 10-15 పరుగులు తక్కువగా ఇవ్వాల్సిందని చెప్పవచ్చు. కానీ 175 పరుగుల లక్ష్యం ఏం పెద్దది కాదు. మేం బ్యాట్‌తో కాస్త మెరుగ్గా ఆడాల్సింది. దురదృష్టవశాత్తు బ్యాటింగ్‌లో రాణించలేకపోయాం.ఈ రోజుల్లో టీ20 క్రికెట్‌లో పరిస్థితులను అందిపుచ్చుకునే సమయం దొరకడం లేదు.

భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం, వికెట్లు కోల్పోవడం, స్థిరంగా ఆడలేకపోవడం, మా వైపు మూమెంటమ్ తీసుకురాకపోవడం ఓటమిని శాసించాయి. మా తప్పిదాల గురించి మేం మాట్లాడుకుంటాం. అయితే వీటికి మరి లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ మరిచి.. ఈ ఫార్మాట్‌లో ఉన్న సానుకూల అంశాలపై ఫోకస్ పెట్టాలి.’అని మార్క్‌రమ్ (Markrum) చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870